CAG Report: ఏపీలో కాకరేపిన ‘కాగ్’.. తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడి

Mana Enadu: ఆంధ్రప్రదేశ్‌(AP)లో గత YCP ప్రభుత్వ పాలనలో జరిగిన ఆర్థిక వ్యవహారాలను కాగ్(Comptroller and Auditor General of India) నివేదిక బయటపెట్టింది. 2023-24లో పన్ను వసూళ్లు రూపాయిలో సగంవంతు కంటే ఎక్కువగా వచ్చాయని పేర్కొంది. మరో 30 పైసలు రుణాల ద్వారా తీసుకొచ్చిందని వెల్లడిచింది. గత ఆర్థిక సంవత్సరం(Last financial year)లో రూ.922 కోట్లు ఆదాయం సొంతపన్ను ద్వార సమకూరిందని తెలిపింది. అసెంబ్లీ(Assembly) అనుమతి లేకుండా విద్యాశాఖలో రూ.249 కోట్లు ఖర్చు చేశారని పేర్కొంది. పైగా 2023లో ఏప్రిల్‌లో RBI వద్ద రాష్ట్ర నిల్వ రూ.19 కోట్లు ఉందని కాగ్ నివేదిక(CAG Report)లో వివరించింది.

 కాగ్ నివేదికలో ఉన్న అంశాలు ఇవే..

* గ్రాంట్-ఇన్-ఎయిడ్ 14 పైసలు, పన్నేతర 3, రుణాల రికవరీ ద్వారా పైసా ఆర్జించారు.
* గత ప్రభుత్వంలో రూపాయిలో 15 పైసలు జీతాలకు వెచ్చించారు.
* DBTలకు 13 పైసలు, వడ్డీలకు 12 పైసలు చెల్లించారు.
* స్థానిక సంస్థలకు రూపాయిలో 9 పైసలే చెల్లించారని వెల్లడి
* ప్రధానమైన పనులకు 9 పైసలే వెచ్చించారు.
* మూలధన వ్యయంగా 9 పైసలే ఖర్చు చేశారట.
* 2023-24లో రాష్ట్ర సొంతపన్ను ఆదాయం రూ.922 కోట్లు.
* 2023 ఏప్రిల్‌లో RBI వద్ద రాష్ట్ర నిల్వ రూ.19 కోట్లు లోటు.
* 2024 మార్చిలో RBI వద్ద రాష్ట్ర నిల్వ రూ.33 కోట్లు లోటు.
* ఏడాది చివరికి పెట్టుబడుల ఖాతాలో అసలు నగదు నిల్వ లేదు.
* 2023-24లో ప్రభుత్వ అప్పులు రూ.4,86,151 కోట్లు.
* ప్రభుత్వ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 34%గా ఉన్నాయి.
* 2023-24లో రూ.2,23,004 కోట్ల మేర ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చారు.
* రూ.69,626 కోట్లు కాన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి PD ఖాతాలకు బదిలీ చేశారని కాగ్ పేర్కొంది.

బడ్జెట్‌పై స్పందించిన జగన్

ఇదిలా ఉండగా AP బడ్జెట్‌(Budget)పై తాజాగా YCP అధినేత జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. తాము 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం అప్పులు రూ.3.13 లక్షల కోట్లు. 2024లో మేం అధికారం నుంచి దిగిపోయే నాటికి అప్పులు రూ.6.46 లక్షల కోట్లుగా ఉన్నాయన్నారు. చంద్రబాబు(Chandrababu) హయాంలో అప్పులు 19 శాతం పెరిగితే… మా హయాంలో పెరిగిన అప్పుల శాతం 15 మాత్రమే అని చెప్పారు. ‘ఇప్పుడు చెప్పండి. అప్పు రత్న పురస్కారం ఎవరికి ఇవ్వాలి? ఆర్థిక క్రమశిక్షణ పాటించింది ఎవరు?’ అంటూ జగన్(Jagan) కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పుడు కూడా అబద్ధాలు చెబుతుండడం చూస్తుంటే సూపర్ సిక్స్(Super Six) హామీలకు ఎగనామం పెట్టేట్టున్నాడని జగన్ దుయ్యబట్టారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *