CM Revanth: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీతో భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో బీసీ రిజర్వేషన్ల(BC Reserveations) అంశంపై సీఎం ప్రధానంగా పీఎం మోదీతో చర్చించే అవకాశం ఉండనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో(local body elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధాని, రాష్ట్రపతికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్(PowerPoint presentation) ద్వారా వివరించేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో సవరణలు చేసి రిజర్వేషన్ల పెంపునకు అనుమతించాలని కోరే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

BC Reservations - aksharatoday.in

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి(President)కి పంపింది. హైకోర్టు విధించిన గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో, ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందితే, స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయడానికి డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు చేయనుంది.

కాంగ్రెస్ పెద్దలతోనూ సమావేశం

సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)తోపాటు ఒకరిద్దరు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు వంటి అంశాలపైనా చర్చించనున్నారు. ఇక సమావేశం అనంతరం రేపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్(Congress) హైకమాండ్‌ పెద్దలు రాహుల్(Rahul), సోనియా గాంధీ(Sonia Gandhi), మల్లికార్జున్ ఖర్గేలతో కూడా సమావేశమై రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై వివరించనున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *