తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి ప్రియాంకా గాంధీ.. వయనాడ్ నుంచి పోటీ

Mana Enadu : కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi).. ఇన్నాళ్లూ తెర వెనక ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఇప్పుడు ఆమె తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లో రెండు లోక్‌సభ, 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు ఈసీ మంగళవారం షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ కేరళ ఎన్నికల(Kerala By Elections 2024)కు సంబంధించి హస్తం పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది.

రాయ్ బరేలి నుంచి ప్రియాంకా గాంధీ

కేరళలో ఒక లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల(Kerala Assembly By Poll 2024)కు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. వయనాడ్‌ లోక్‌ సభ స్థానం (Wayanad MP By Poll 2024) నుంచి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని బరిలోకి దింపుతోంది. ప్రియాంకా గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగుతున్నారు.

పాలక్కడ్, చెలక్కార స్థానాల అభ్యర్థులు వీరే

మరోవైపు పాలక్కడ్‌, చెలక్కార (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలకు రాహుల్‌ మమ్‌కూటథిల్‌, రమ్య హరిదాస్‌లను పార్టీ ఖరారు చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీరిని ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్‌ (KC Venugopal) వెల్లడించారు.

రాహుల్ రాజీనామాతో వయనాడ్ కు ఉపఎన్నిక

లోక్‌ సభ ఎన్నికల్లో రెండు స్థానాలు(రాయ్‌ బరేలీ, వయనాడ్​) నుంచి రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఏదైనా ఒక్కస్థానంలోనే కొనసాగాలన్న నిబంధనతో ఆయన కాంగ్రెస్ కంచుకోట అయిన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాయ్‌ బరేలీలోనే కొనసాగాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వయనాడ్ ను వదులుకోవడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో వయనాడ్​ నుంచి ప్రియాంకా గాంధీని పోటీ చేయించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *