Rains: వరుణుడు ఉప్పెనై.. వీధులు ఏరులై.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన వర్షం

తెలుగు రాష్ట్రాల్లో వానలు(Rains) దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులు రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు(Heavy Rains) పడతాయని వాతావరణశాఖ(IMD) తెలిపింది. ఇదిలా ఉండగా నిన్న మధ్య తెలంగాణ(Telangana) జిల్లాలు వరుణుడి దెబ్బకు అతలాకుతలమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. ప్రధానంగా హైదరాబాద్‌(Hyderabad) పరిధిలో ఈ ఏడాదిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో 12.9 సెంటీమీటర్లు కురిసింది. సికింద్రాబాద్‌ పరిధి మారేడుపల్లిలోని పికెట్‌ ప్రాంతంలో 11.5 సెం.మీ నమోదైంది. మేడ్చల్‌- మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, జనగామ, పెద్దపల్లి, మెదక్, యాదాద్రి, సిద్దిపేట, నిర్మల్‌ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

వరదకు కుదేలైన జంట నగరాలు

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాగులు, వంకలు, నాలాలు ఉప్పొంగాయి. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో కురిసిన వర్షానికి జనం విలవిల్లాడారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. GHMC, HMDA, వాటర్‌ వర్క్స్, విద్యుత్, పోలీసు, SDRF, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ఏపీలోనూ విస్తారంగా వానలు

అటు ఏపీ(Andhra Pradesh)లోని పలు ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం(APSDMA) తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలతోపాటు ఈదురు గాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *