నరాలు తెగే ఉత్కంఠ.. క్షణక్షణం మారే ఆధిపత్యం.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం.. వెరసీ ఇండియా-పాకిస్థాన్(India vs Pakistan) మ్యాచ్. ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)లో భాగంగా ఇవాళ హైఓల్టేజ్ మ్యాచ్(High voltage match)కు దుబాయ్ స్టేడియం వేదికగా నిలవనుంది. కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు రెండు క్రీడా వినోదాన్ని పంచనున్నాయి. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచుకు ఇండియా, పాక్ సిద్ధమయ్యాయి. ఇవాళ దుబాయ్(Dubai) వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్(BAN)పై గెలిచి మంచి ఊపులో ఉంది భారత్. అటు ఆరంభ పోరులోనే బొక్కబోర్లా పడింది పాక్ టీమ్. దీంతో రెండు జట్లు ఈ మెగా టోర్నీలో ముందుకెళ్లాలంటే ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. దీంతో గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు.
ఓవరాల్‌గా పాక్‌దే పైచేయి
ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు జట్లలో భారత్(Team India) బలంగా కనిపించినా.. ఛాంపియన్స్ ట్రోఫీ(CT)లో మాత్రం పాకిస్థాన్(PAK)దే పైచేయి. ఈ టోర్నమెంట్లో 2 జట్ల మధ్య జరిగిన 5మ్యాచుల్లో పాక్ 3 మ్యాచుల్లో గెలుపొందింది. ఇందులో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై పాక్ విజయం సాధించింది. మొత్తంగా భారత్-పాక్ మధ్య మొత్తం 134 ODIలు జరిగాయి. వీటిలో భారత్ 56 మ్యాచులు గెలుపొందగా.. పాక్ 73 మ్యాచుల్లో విజయం సాధించింది. 5 మ్యాచుల్లో రిజల్ట్ తేలలేదు.

ఓడితే ఇంటికే..
అయితే ఈ మ్యాచ్ పాకిస్థాన్‌కు డూ ఆర్ డై(DO or DIE) లాంటింది. ఓడితే పాక్ టోర్నీ నుంచి ఔట్ అవుతుంది. ఇక భారత్ గెలిస్తే సెమీస్(Semis)కు చేరుకుంటుంది. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోని పిచ్(Pitch) సాధారణంగా స్లో ట్రాక్‌లో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. ఈ పిచ్‌పై కొత్త బంతి ఫాస్ట్ బౌలర్లకు సహాయపడుతుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపనున్నారు. కాబట్టి టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. కాగా జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్-18లలో లైవ్ చూడొచ్చు.
తుది జట్ల అంచనా
INDIA: రోహిత్ శర్మ (C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (WK), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ మరియు హర్షిత్ రాణా.
PAKISTAN: ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (C& WK), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.






