
రష్యాతో సత్సంబంధాలు, ఆ దేశం చమురును కొనుగోలు చేస్తున్నామన్న అక్కసుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై టారిఫ్ లను డబుల్ చేశారు. ఇదివరకు ఉన్న 25 శాతం టారిఫ్ లను 50శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. భారత్ పై ఇప్పటికే 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్ (Donald Trump) తాజాగా దాన్ని 50 శాతానికి పెంచారు. అంతకుముందు ప్రకటించిన పాత 25 శాతం టారిఫ్ లు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్తగా అదనంగా విధించిన 25% సుంకాలను (Trump Tariffs on India) ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పరోక్షంగా స్పందించారు. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదని అమెరికాకు బదులిచ్చారు.
రైతుల సంక్షేమమే ప్రాధాన్యం..
దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ జయంతి ఉత్సవాలను పురస్కరించిన దిల్లీలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ (PM Modi) చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాతో వాణిజ్యం, టారిఫ్స్ అంశంపై (Trumps tariff war) ఇన్డైరెక్ట్ గా మాట్లాడారు. ‘రైతుల సంక్షేమమే మాకు అత్యంత ప్రాధాన్యం. రైతులు, మత్స్యకారులు, పాడిరైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీపడబోం. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు వ్యక్తిగతంగా ఎంత మూల్యమైనా చెల్లించేందుకు నేను సిద్ధమే’ అని మోదీ వ్యాఖ్యానించారు.
అక్కసుతోనే భారీ టారిఫ్‌లు
ట్రంప్ విధించిన టారిఫ్ లతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. ముఖ్యంగా రొయ్యలు, జంతు సంబంధ ఉత్పత్తులపై అదనపు భారం పడింది. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తుల (Agriculture Products) పై సుంకాలు తగ్గించాలని అమెరికా చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. కానీ వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం మినహాయింపునకు భారత్ ససేమిరా అంది. దీంతో అక్కసుతో అమెరికా టారిఫ్ లు విధించినట్లు తెలుస్తోంది.
BREAKING ⚠️
“Ready to pay a personal price (to resist tariffs), will not compromise on the interests of farmers,” says PM @NarendraModi #TariffsOnIndia pic.twitter.com/mCQbt4MoNK
— Shiv Aroor (@ShivAroor) August 7, 2025