Mana Enadu: సొంతగడ్డపై న్యూజిలాండ్(New Zealand)తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసిన టీమ్‌ఇండియా(Team India).. మరో పోరుకు సిద్ధమైంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి పుణే(Pune) వేదికగా ఉదయం 9.30 గంటల నుంచి సెకండ్ టెస్ట్(Second Test) జరగనుంది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలి విమర్శలు ఎదుర్కొన్న రోహిత్(Rohit) సేన, రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్నా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. టెస్టు సిరీస్‌ను నిలుపుకోవాలంటే ఈ టెస్టులో భారత్ తప్పక నెగ్గాలి. పైగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్(World Test Championship Final) బెర్తు రేసులో నిలవడానికీ టెస్టు టీమ్ఇండియాకు చాలా కీలకం. ఈ నేపథ్యంలో నేటి నుంచి జరగనున్న టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆ ఇద్దరూ ఫిట్
ఇదిలా ఉండగా రెండో టెస్టుకు భారత స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill)తో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) ఫిట్‌గా ఉన్నారని టీమ్‌ఇండియా అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డస్కటె వెల్లడించారు. ఫస్ట్ టెస్టుకు ముందు గిల్‌కు మెడ కండరాలు పట్టేయగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. అదే మ్యాచ్‌లో కీపింగ్ చేస్తూ పంత్ మోకాలికి గాయమైంది. తాజాగా వీరి గాయాలపై డస్కటె మాట్లాడుతూ.. ‘జట్టులో అందరూ ఫిట్‌గా ఉన్నారు. గిల్ గత వారం బ్యాటింగ్ చేశాడు. పంత్ కూడా పూర్తి ఫిట్‌గా ఉన్నాడు’ అని తెలిపాడు. అయితే గిల్ రాకతో మిడిలార్డర్‌లో సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan), రాహుల్(Rahul) మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

జోరుమీదున్న కివీస్
బెంగళూరు టెస్టు(Bengaluru Test) ఇచ్చిన విజయంతో జోరుమీదున్న న్యూజిలాండ్.. స్పిన్‌కు స్వర్గధామమైన పుణేలో టీమ్ఇండియాను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(Kane Williamson) ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకున్నా.. కాన్వే, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిఫ్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్ వంటి నాణ్యమైన ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కావడంతో మిచెల్ శాంట్నర్‌ను మ్యాచ్ ఆడించే ఆలోచనలో ఆ జట్టు ఉంది. శాంట్నర్, అజాజ్ పటేల్‌తో పాటు రచిన్, ఫిలిప్స్ భారత బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు.
తుది జట్లు (అంచనా)
Team India: రోహిత్ (C), జైస్వాల్, గిల్, కోహ్లీ, పంత్(WK), రాహుల్/సర్ఫరాజ్, జడేజా, అశ్విన్, కుల్‌దీప్, బుమ్రా, సిరాజ్/ఆకాశ్
New Zealand: లాథమ్ (C), కాన్వే, యంగ్, రచిన్, మిచెల్, బ్లండెల్(WK), ఫిలిప్స్, శాంట్నర్, సౌథీ/ఓరూర్కీ, హెన్రీ, అజాజ్








