JEE Main ఫలితాలు రిలీజ్.. టాప్-2 ర్యాంకులు రాజస్థాన్ విద్యార్థులవే

దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న  జేఈఈ మెయిన్‌ సెషన్ -2 ఫలితాలు(JEE Main 2025 Results) వచ్చేశాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్‌ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ(NTA) అధికారులు.. తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్‌ స్కోరుతో అర్ధరాత్రి తర్వాత ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITల్లో BE/B.Tech కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్‌ -1 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌

JEE Main పరీక్షలకు దేశ వ్యాప్తంగా 10,61,849 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 9,92,350మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 24మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ స్కోరుతో అదరగొట్టారు. వీరిలో AP నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి హర్ష్‌ ఎ.గుప్తా, వంగల అజయ్ రెడ్డి, బనిబ్రత మజీ ఉండటం విశేషం. జేఈఈ (మెయిన్‌) పేపర్‌ -2 (బీఆర్క్‌/బి ప్లానింగ్‌) ఫలితాలను తర్వాత ప్రకటించనున్నట్లు NTA వెల్లడించింది.

Image
ఏప్రిల్‌ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తులు

కాగా జేఈఈ (మెయిన్‌) సెషన్‌ 1, 2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయించారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్‌ ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకోసం మే 18న జరిగే జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) పరీక్షకు ఏప్రిల్‌ 23 నుంచి మే 2 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

NOTE: ఫలితాలు, స్కోర్ కార్డు కోసం  https://jeemain.nta.nic.in/ను సందర్శించండి.

Related Posts

JNV: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరోసారి నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తు గడువు పెంపు

విద్యార్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న జవరహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు(Application Deadline)ను అధికారులు మరోసారి పొడిగించారు. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 27వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. 2026- 27…

TG TET: తెలంగాణ టెట్​ రిజల్ట్స్​ వచ్చేశాయ్​..

తెలంగాణ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) (TG TET) రిజల్ట్స్​ వచ్చేశాయి. సచివాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు జరిగాయి. మొత్తం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *