Mana Enadu : ప్రముఖ రియాల్టీ షోలల్లో బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమానిది ప్రత్యేక స్థానం. సెలబ్రిటీ రియాల్టీ షోలలో ఈ షో నంబర్ వన్ లో ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో, వివిధ భాషల్లో ఈ షో రన్ అవుతోంది. ముఖ్యంగా హిందీ బిగ్ బాస్ షోకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. బీ టౌన్ లో ఆ షోకు వస్తున్న ఆదరణ చూసి సౌత్ ఇండియాలోనూ తెలుగు (Bigg Boss Telugu), తమిళం, కన్నడ, మలయాళంలో ఈ షోను నడిపిస్తున్నారు. వివిధ భాషల్లో ఆ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఈ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్నారు.
బిగ్ బాస్ కు స్టార్ హీరో గుడ్ బై
అలా దాదాపు 11 సీజన్ల నుంచి బిగ్ బాస్ (Bigg Boss Kannada) షోకు హోస్టుగా వ్యవహరిస్తున్న ఓ స్టార్ హీరో నెక్స్ట్ సీజన్ నుంచి ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల చేసిన ప్రకటన ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్. ‘బిగ్‌బాస్ కన్నడ’కు హీరో సుదీప్ (Kiccha Sudeep) 11 సీజన్ల నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇకపై తాను ఈ షోకు హోస్ట్‌గా చేయాలనుకోవడం లేదని ఆయన రెండు నెలల క్రితం ప్రకటించగా.. తాజాగా ఆ నిర్ణయం వెనుక గల కారణాన్ని వివరించారు.
అసలు కారణం ఏంటంటే..
‘ఈగ (Eega)’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమైన కిచ్చా సుదీప్ ఆ తర్వాత విక్రాంత్ రోణతో మరింత చేరువయ్యారు. తాజాగా ఆయన నుంచి వస్తున్న మరో మూవీ మ్యాక్స్. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ క్రిస్మస్ (Christmas) కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సుదీప్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బిగ్‌బాస్ హోస్టింగ్ నుంచి తప్పుకుంటున్నానని తాను చేసిన ప్రకటన గురించి క్లారిటీ ఇచ్చారు.
అందుకే ఆ నిర్ణయం తీసుకున్నా
“ఆరోజు నేను పోస్టు పెట్టిన సమయంలో చాలా అలసిపోయి ఉన్నాను. అందుకే బిగ్ బాస్ షోకు ఇక హోస్టింగ్ చేయొద్దని అనుకున్నాను. ఆ నిర్ణయం కరెక్టేననిపించి.. అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే నేను సోషల్ మీడియాలో పోస్టు పెట్టాను. ఒకవేళ ఆరోజు నేను పోస్టు చేయకపోతే.. మళ్లీ నా ఆలోచనా విధానం మారిపోయి ఉండేది. నేను హోస్టింగ్ కు గుడ్ చెప్పడానికి గల కారణాల్లో అంతర్గతంగా జరిగిన కొన్ని లోటుపాట్లు కూడా ఒకటి. నా కష్టానికి తగిన గుర్తింపు రావడం లేదు అనిపించింది.
ఇదే చివరి సీజన్
మిగతా భాషల్లో బిగ్ బాస్ షోలకు వచ్చినంత గుర్తింపు కన్నడ షోకు రాలేదు. అందుకే దానికి కేటాయించే సమయాన్ని సినిమాలకు ఇస్తే బాగుంటుందని అనిపించింది. అందుకే బిగ్ బాస్ షో హోస్టింగ్ (Bigg Boss Kiccha Sudeep) కు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యాను.” అని సుదీప్ ఈ సందర్భంగా తన నిర్ణయానికి గల కారణాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ సీజన్ 11 కన్నడకు హోస్టింగ్ చేస్తున్నారు. ఈ సీజనే తన చివరి సీజన్ అని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే సీజన్ నుంచి తాను హోస్టుగా చేయనని స్పష్టం చేశారు.








