మాంచెస్టర్(Manchester)లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్(India-England Test series)లోని నాల్గవ టెస్ట్(4th Test) మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈనెల 23 నుంచి ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్(England) జట్టు నాల్గవ రోజు (జులై 26) ముగిసే సమయానికి ఆధిపత్యంలో నిలిచింది. ఇక చివరి రోజైన నేడు (జులై 27) భారత బ్యాటర్లు ఏ మేరకు పోరాడుతారనే దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 కీలక వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఓపెనర్ జైస్వాల్(Jaiswal), వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్(Sai Sudharshan) ఇద్దరూ డకౌట్ అయ్యారు. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ (87*), కెప్టెన్ గిల్ (78*) బాధ్యాయుతంగా ఆడటంతో భారత్ మరో వికెట్ కోల్పోకుండా నాలుగో రోజు ఆటను ముగించింది. కాగా భారత్ ఇంకా 137 రన్స్ వెనుకబడి ఉంది.
)
జో రూట్, స్టోక్స్ భారీ శతకాలు..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో జో రూట్(150), బెన్ స్టోక్స్(141) భారీ సెంచరీలతో చెలరేగారు. అటు క్రాలీ (84), డకెట్ (94), పోప్ (71) హాఫ్ సెంచరీలతో మెరిశారు. చివర్లో డాసెన్ (26), కార్స్ (47) రన్స్ చేయడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో జడేజా(Jadeja) 4 వికెట్లు కూల్చగా.. బుమ్రా, సుందర్ చెరో రెండు వికెట్లు తీశారు. కాగా ఈరోజు రాహుల్(KL Rahul), గిల్(Gill) భారీ భాగస్వామ్యం నమోదు చేస్తేనే భారత్ మ్యాచును కాపాడుకోగలదు. సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
Rahul and Gill frustrate England after Stokes’ ton as India face herculean task to save fourth Test #INDvsENGTest https://t.co/tkV1NtCJec pic.twitter.com/2G2TDRl6B8
— Gulf Today (@gulftoday) July 26, 2025






