ఐపీఎల్ 2025లో భాగంగా లక్నోలోని ఎకనా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్(GT)తో జరుగుతున్న మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్(LSG) టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఒక మార్పు చేసింది. మిచెల్ మార్ష్(Mitchel Marsh) ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో హిమ్మత్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక గుజరాత్ టైటాన్స్(GT) కూడా ఒక మార్పు చేసింది. కుల్వంత్ స్థానంలో వాషింగ్టన్ సుందర్(Sunder)ను తీసుకుంది.
🚨 Indian Premier League 2025, GT vs LSG 🚨
Lucknow Super Giants won the toss and opt to bowl first#GTvLSG #GTvsLSG #LSGvsGT #LSGvGT #IPL2025 #TATAIPL2025 #TATAIPL #Lucknow #AavaDe #GujaratTitans #LucknowSuperGiants pic.twitter.com/t5Wtu5HmAk
— Sporcaster (@Sporcaster) April 12, 2025
కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ రిషభ్ పంత్ ఆటపై అందరి దృష్టి నెలకొంది. వేలంగా ఏకంగా రూ. 27 కోట్లు పెట్టి మరీ లక్నో పంత్‌ను దక్కించుకుంది. అయితే పంత్ ఇప్పటి వరకు ఏ మాత్రం రాణించలేదు. ఇక గుజరాత్ టైటాన్స్ దూకుడు మీద ఉంది. తొలి మ్యాచ్‌లో ఓడిన గుజరాత్.. వరుసగా 4 మ్యాచ్ ల్లో నెగ్గి గ్రూప్ టాపర్‌గా ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గుజరాత్ టైటాన్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తుది జట్లు ఇవే..
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(C), జోస్ బట్లర్(W), వాషింగ్టన్ సుందర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(W/C), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్






