“మన్యం ధీరుడు” రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Mana Enadu: మన్యం వీరుడు (Manyam Veerudu) అల్లూరి సీతారామరాజు జీవితంపై, పోరాటంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా నుంచి మొన్నటి రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రం వరకు అల్లూరి గురించి ఎంతో మంది దర్శకులు ఎన్నో విషయాలు చెప్పారు. తాజాగా మరో దర్శకుడు ఈ మన్యం వీరుడిలోని మరో కోణాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు.

నరేశ్ డెక్కల దర్శకత్వంలో ఆర్‌వీవీ మూవీస్ పతాకంపై ఆర్.పార్వతీ దేవి సమర్పణలో వస్తున్న సినిమా “మన్యం ధీరుడు” (Manyam Dheerudu). ఆర్‌వివి సత్యనారాణ స్వీయ నిర్మాణంలో నటించిన ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. సెప్టెంబరు 20వ తేదీన ఈ సినిమా (Manyam Dheerudu Release Date) విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు పవన్ కుమార్ సంగీతం అందించగా, వినీత్ ఆర్య, ఫరూక్ సినిమాటోగ్రఫీ చేశారు.

అల్లూరి సీతారామరాజు (Alluri Sitharamaraju) నిజరూప చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు తాను చాలా కష్టపడినట్లు సత్యనారాయణ తెలిపారు. అల్లూరి పాత్ర కోసం తాను కత్తియుద్ధం, గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు చెప్పారు, విలువిద్యలో శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించారు. మన్యం ధీరుడు సినిమా యదార్థ సంఘటనలను తలపించాలని చిత్రబృందం చాలా కష్టపడిందని వివరించారు. బానిస సంకెళ్లు తెంచుకుని అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ దొరల పాలనకు చరమగీతం పాడే సీన్స్ గూస్‌ బంప్స్ తెప్పిస్తాయని చెప్పారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *