ManaEnadu : “మరిచిపొకమ్మా (Marichipokammaa)… మమ్మరవబోకమ్మా …. నడిచేటి కాలానా నెరవేర్చు ధర్మానా… విడిచి పోతున్నా మరువబోకమ్మా… మరిచిపొకమ్మా… మమ్మరువబోకమ్మా” అంటూ అన్నాచెల్లెలి మధ్య అనుబంధాన్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరించిన ఈ పాట “చిట్టిపొట్టి” (Chitti Potti) అనే సినిమాలోనిది. తాజాగా ఈ పాటను మేకర్స్ విడుదల చేశారు. విడుదలైన క్షణాల్లోనే లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. చాలా ఎమోషనల్‌గా ఈ పాట ఉందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ పాటను శ్రీ వెంకట్ కంపోజ్ చేశారు. దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ లిరిక్స్ రాశారు.
భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ (Bhaskar Yadav) దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సినిమా చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘మరిచిపోకమ్మా.. మరువబోకమ్మా’ అనే పాటను రిలీజ్ చేశారు. అన్నాచెల్లెలి అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం.
తాజాగా విడుదల చేసిన పాట నెటిజన్లను ఫిదా చేస్తోంది. అన్నాచెల్లెల్ల (Brither Sister) మధ్య రిలేషన్‌ను చాలా అందంగా ఆవిష్కరించారని ఆడియెన్స్ అంటున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధంతో సాగే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఓ ఆడపిల్ల చెల్లెలుగా, మేనత్తగా, బామ్మగా మూడు తరాల్లో పుట్టింటితో తనకున్న మమకారాన్ని ఈ సినిమాలో చూడొచ్చని అంటున్నారు. ఈ సినిమాను ప్రతి అమ్మాయి తనకు రిలేట్ చేసుకుంటుందని చెబుతున్నారు. అక్టోబర్ 3వ తేదీన ఈ సినిమా (Chitti Potti Release Date) థియేటర్లలో విడుదల కాబోతోంది.
నటీనటులు:
రామ్ మిట్టకంటి , పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ
సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి
సంగీతం: శ్రీ వెంకట్
కొరియోగ్రాఫర్: కపిల్ మాస్టర్ ఎడిటర్: బాలకృష్ణ బోయ
కెమెరా: మల్హర్బట్ జోషి
పి.ఆర్.ఓ: లక్ష్మి నివాస్