వీసా లేకుండా బ్యాంకాక్‌కు .. హైదరాబాద్ నుంచి టికెట్ జస్ట్ రూ.7,390

Mana Enadu : సాధారణంగా విదేశాలకు వెళ్లాంటే వీసా (Visa) తప్పనిసరి. టికెట్ ధరలు కూడా వేలు, లక్షల్లో ఉంటాయి. కానీ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు వెళ్లాలంటే మాత్రం వీసా అవసరం లేదు. అంతేకాదు మీరు ఊహించనంత తక్కువ ధరకే అక్కడికి వెకేషన్‌కు వెళ్లొచ్చు. టూరిస్టుల కోసం థాయ్ ఎయిరేషియా (Thai Air Asia) తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మరి ఈ ఆఫర్ ఏంటి? టికెట్ ధరలు ఎంత? అసలు ఈ ప్యాకేజ్ సంగతులేంటో చూద్దామా?

హైదరాబాద్ (Hyderabad) నుంచి బ్యాంకాక్​ వెళ్లేందుకు థాయ్ ఎయిర్ ఏసియా అతి తక్కువ ధరల్లో టికెట్లు అందిస్తోంది. హైదరాబాద్ నుంచి రూ.7,390, చెన్నై నుంచి ఫుకెట్​ (Phuket)కు రూ.6,990లకే థాయ్‌లాండ్‌కు వెళ్లే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ వైజాగ్ సహా దేశంలోని 12 నగరాలకు థాయ్​ల్యాండ్ నుంచి విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. తాజాగా హైదరాబాద్ టు బ్యాంకాక్, చెన్నై (Chennai) టు ఫుకెట్ సర్వీసులను ప్రారంభించింది.

అక్టోబరు 27 నుంచి హైదరాబాద్ – బ్యాంకాక్ (Bangkok), అక్టోబరు 30 నుంచి చెన్నై – ఫుకెట్ సర్వీసు ప్రారంభం కానున్నాయి. ఆఫర్ కింద ఈ నెల 22 వరకు రాయితీ టికెట్లను https://www.airasia.com/en/gb, ఎయిరేషియా మూవ్ యాప్​పై విక్రయిస్తున్నారు. హైదరాబాద్ టు బ్యాంకాక్ మధ్య 2024 అక్టోబరు 27 నుంచి 2025 మార్చి 29 వరకు, చెన్నై – ఫుకెట్ మధ్య 2024 అక్టోబరు 30వ తేదీ నుంచి 2025 మార్చి 29 మధ్య ప్రయాణానికి వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. భారతీయ ప్రయాణికులకు థాయ్‌లాండ్‌ (Thailand)కు వెళ్లేందుకు కేవలం పాస్‌పోర్టు ఉంటే సరిపోతుందని, వీసా అక్కర్లేదని థాయ్ ఎయిరేషియా వాణిజ్య విభాగాధిపతి తన్సిత తెలిపారు.

థాయ్‌లాండ్ ట్రిప్‌ (Thailand Tour) గురించి ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

  • అక్టోబరు 27 : హైదరాబాద్ – బ్యాంకాక్
  • అక్టోబరు 30 : చెన్నై – ఫుకెట్
  • హైదరాబాద్ – బ్యాంకాక్ ఆఫర్ అక్టోబర్ 2024 టు మార్చి 2025 వరకు
  • చెన్నై – ఫుకెట్ అక్టోబర్ 2024 టు మార్చి 2025

Share post:

లేటెస్ట్