అంతర్జాతీయ క్రికెట్(International Cricket)లో స్టార్ క్రికెటర్లు అందరూ ఒక్కొక్కరుగా తమ ప్రొఫెషనల్ గేమ్‌కు వీడ్కోలు పలుకుతున్నారు. మొన్న టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన అభిమానులకు షాకిచ్చారు. తాజాగా ఈ జాబితాలోకి పలువురు స్టార్ క్రికెటర్లు చేరారు. సోమవారం (జూన్ 2)న ఆస్ట్రేలియా విధ్వంసక ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్(Glenn Maxwell) వెల్ ODIలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. మ్యాక్సీ ఆస్ట్రేలియా తరఫున 149 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. 3,990 రన్స్ చేశాడు. ఇందులో ఓ భారీ డబుల్ సెంచరీ(201*) కూడా ఉంది. అయితే టీ20 క్రికెట్లో మాత్రం కొనసాగుతానని అతడు క్లారిటీ ఇచ్చాడు. కాగా మ్యాక్స్‌వెల్ టెస్టు క్రికెట్లో చోటు కోసం కష్టపడుతున్నాడు. అతడు 2017లో బంగ్లాదేశ్(Bangladesh)పై తన చివరి టెస్టు ఆడాడు. టెస్టు క్రికెట్ కెరీర్‌పై ఆయన స్పందించలేదు.
🚨 HUGE NEWS 🚨
Heinrich Klaasen calls time on his international career!
Glenn Maxwell waves goodbye to ODIs in style! 💥🔥
From explosive shots to unforgettable moments,
Like if you’re a true cricket fan! #Maxwell #GlennMaxwell #HeinrichKlaseen #MIvsPBKS pic.twitter.com/xuITFyEg5O— Popcorn (@thebaddestblch) June 2, 2025
కాటేరమ్మ పెద్దకొడుకు కూడా
ఇదిలా ఉండగా మ్యాక్స్ వెల్ రిటెర్మెంట్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే దక్షిణాఫ్రికా(South Africa) విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klassen) అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల(All Formats) నుంచి రిటైర్మెంట్(Retirement) ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 33 ఏళ్ల వయసులోనే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం అభిమానులను, క్రికెట్ విశ్లేషకులను నిరాశకు గురి చేసింది. IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తరపున ఆడే క్లాసెన్, తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఎంతో ఇష్టమైన ఆటగాడిగా పేరుగాంచాడు. క్లాసెన్ 2018లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తన ఏడేళ్ల కెరీర్లో దక్షిణాఫ్రికా తరపున కీలక పాత్ర పోషించాడు. అతను 4 టెస్టులు, 60 ODIలు, 58 T20 మ్యాచ్‌లు ఆడాడు.
View this post on Instagram






