Krithi Shetty: లైంగిక వేధింపుల కేసు.. కృతిశెట్టి రియాక్షన్ ఇదే

ManaEnadu: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Choreographer Jony Master) లైంగిక ఆరోపణల కేసు కుదుపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే జానీ మాస్టర్‌పై హైదరాబాద్‌(HYD)లోని నార్సింగి పోలీసులు పోక్సో(POCSO) కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు బాధితురాలి(VICTIM)కి పలువురు నటీనటులు మద్దతు తెలుపుతున్నారు. నిజానికి ఇండస్ట్రీ(Industry)లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నా ధైర్యంగా బయటికొచ్చే వారి సంఖ్య మాత్రం తక్కువే. తాజాగా మలయాళ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ(Justice Hema Committee) నివేదిక తర్వాత ఈ ఘటన వెలుగు చూడటం గమనార్హం. ఆ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని హేమ రిపోర్టులో పేర్కొంది. తాజా ఇప్పుడు టాలీవుడ్‌(Tollywood)లోనూ అలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయని జానీ మాస్టర్ కేసు ద్వారా తెలుస్తోంది.

 తలచుకుంటేనే భయమేస్తోంది: కృతిశెట్టి

ఇదిలా ఉండగా తాజాగా జానీ మాస్టర్‌పై వచ్చిన ఆరోపణలపై సినీ పరిశ్రమలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు కూడా. ఇప్పటికే యాంకర్ అనసూయ(Anchor Anasuya) బాధితురాలికి మద్దతు తెలపగా.. తాజాగా హీరోయిన్ కృతిశెట్టి(Kriti Shetty) స్పందించింది. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. బాధితురాలు అనుభవించిన మానసిక క్షోభను తలచుకుంటేనే భయమేస్తోందంది. ఇలాంటి ఘటనలు జరగకుండా సినీ పెద్దలు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నానని, అప్పుడే కొత్తవారికీ ఇండస్ట్రీపై సానుకూల ధోరణీ ఏర్పడుతుందని కృతి అన్నారు. కాగా యాంకర్ అనసూయ సైతం బాధితురాలిని పుష్ప(Pushpa) మూవీ షూటింగ్‌ సమయంలోనే చూశానని, ఆమె చాలా టాలెంట్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

 నిందితుడిగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలి: కరాటే కళ్యాణి

మరోవైపు అత్యాచార ఆరోపణలు(Allegations of rape) ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై సినీ నటి కరాటే కళ్యాణి(Karate Kalyani) మండిపడ్డారు. ‘జానీ మాస్టర్‌ది కచ్చితంగా లవ్ జిహాదీ కేసే. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలి. నిందితుడిగా తేలితే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మతం మారితే పెళ్లి చేసుకుంటాననడం ఏమిటి? బాధితురాలికి అందరూ అండగా నిలవాలి’ అని ఆమె మీడియా సమావేశంలో అన్నారు. పరిశ్రమలో మహిళలు ఇలాంటి పరిస్థితుల ఎదుర్కొంటే ధైర్యంగా బయటికి రావాలని ఆమె కోరారు.

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *