ManaEnadu:గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రధాన పాత్రలో దర్శకుడు కొరటాల శివ (Koratala Shiva) తెరకెక్కించిన సినిమా దేవర. రెండు విభాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్-1 ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి కీలక అప్డేట్
దేవర ప్రీ రిలీజ్ (Devara Pre Release Event) ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో సెప్టెంబర్ 22వ తేదీ (ఆదివారం) నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దాదాపుగా ఇదే డేట్ ఫిక్స్ అని టాక్ వినిపిస్తోంది.
ఇక దేవర సినిమా సంగతికి వస్తే జనతాగ్యారేజ్ (Janatha Garage) తర్వాత దర్శకుడు కొరటాల-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దేవరపై బాగా హైప్ క్రియేట్ అయింది. మరోవైపు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా ఈ సినిమాపై హైప్‌ను మరింత పెంచేశాయి. రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా తొలి భాగంలో తారక్ డ్యూయెల్ రోల్లో నటిస్తున్నాడు. తండ్రీకొడుకులుగా తారక్ తన పాత్రతో అదరగొట్టనున్నాడు.
మరోవైపు ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ, అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. బీ టౌన్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Alikhan) విలన్ పాత్రలో అలరించనున్నాడు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాక్కో, టెంపర్ వంశీ, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువ సుధ ఆర్ట్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాకు యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) మ్యూజిక్ అందించాడు. మరోవైపు దేవర సినిమాకు సంబంధించి ప్రమోషన్స్‌లో మూవీ టీమ్ బిజీబిజీగా ఉంది.