WPL: ఢిల్లీని ఢీకొట్టేదెవరో.. నేడు ముంబై-గుజరాత్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్

మెన్స్ క్రికెట్‌లో సంచలనం సృష్టించిన IPL.. ఉమెన్స్ విభాగంలోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. దీంతో పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా అభిమానులు తమ ఫేవరేట్ క్రీడ క్రికెట్‌ను విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ కోవలోనుంచి పుట్టుకొచ్చిందే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL). మహిళల క్రికెట్‌నూ ఎంకరేజ్ చేయాలని, యువ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో BCCI 2023 మార్చిలో ఈ లీగ్‌ను తీసుకొచ్చింది. తొలిసీజన్లో ముంబై ఇండియన్స్(MI) టైటిల్ దక్కించుకోగా.. 2024లో జరిగిన రెండో ఎడిషన్‌లో RCB విజేతగా నిలిచింది. ఇక ఈ ఏడాది మూడో ఎడిషన్ జరుగుతోంది.

మూడోసారి ఎలిమినేటర్‌ పోరుకు సిద్ధమైన ముంబై

నెల రోజులుగా అంటే ఫిబ్రవరి 14న ప్రారంభమైన ఈ లీగ్ క్రికెట్‌ అభిమానులను విశేషంగా అలరిస్తున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) 3వ సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ మెగా టోర్నీలో మిగిలిఉంది ఇక రెండు మ్యాచ్‌లే. లీగ్‌ దశ మంగళవారమే ముగియగా 5 విజయాలతో టేబుల్‌ టాపర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌(DC) వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరింది. ఇక తొలి ఎడిషన్‌ విన్నర్‌ ముంబై ఇండియన్స్‌.. మూడోసారి ఎలిమినేటర్‌ పోరుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ గుజరాత్‌(GT)తో ఎలిమినేటర్ మ్యాచ్‌(Eliminator Match)‌లో తలపడనుంది. ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన విజేత.. ఈనెల 15న ఇదే వేదికపై ఢిల్లీతో జరిగే ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.

MI-W Schedule and Squad for WPL 2025

తుది జట్ల అంచనా

Mumbai Indians: హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (C), అమంజోత్ కౌర్, యాస్తిక భాటియా (WK), సజీవన్ సజన, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, పరునికా సిసోడియా

Gujarat Giants: బెత్ మూనీ (WK), కష్వీ గౌతమ్, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్ (C), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, డియాండ్రా డాటిన్, భారతీ ఫుల్మాలి, సిమ్రాన్ షేక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్, ప్రియా మిశ్రా

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *