మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) చేతిలో ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చిత్రంతో పాటు దేవర పార్ట్-2 (Devara Part-2) ఉన్నాయి. అంతే కాకుండా వార్-2 సినిమాతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ప్లాన్ చేశాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ (Dragon), కొరటాల శివతో దేవర పార్ట్-2 చేయనున్నాడు. అయితే ఈ రెండు ప్రాజెక్టులు లైన్ లో ఉండగానే మరో సినిమాకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. తమిళ సినిమా ఇండస్ట్రీలో డాక్టర్, జైలర్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన దర్శకుడితో ఎన్టీఆర్ ఓ ప్రాజెక్టు చేయనున్నట్లు తెలిసింది.
నెల్సన్ తో ఎన్టీఆర్ రాక్
తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) తారక్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారట. మాస్, యాక్షన్, కామెడీ జానర్ లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఊరమాస్ క్యారెక్టర్లో కనిపించనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టుకు ‘రాక్ (ROCK)’ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. తారక్ మాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని నెల్సన్ ప్లాన్ చేస్తున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ మూవీ రానుందట.
2026లో సెట్స్ పైకి సినిమా
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ (Prashant Neel) సినిమా తర్వాత ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగవంశీ నెల్సన్ తో ఈ ప్రాజెక్టు ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఈ ఏడాది చివరలో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారట. 2026లో సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. నెల్సన్ మాస్ టేకింగ్.. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కలిస్తే ఈ సినిమా పక్కా కమర్షియల్ హిట్ అవుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






