సినీ ప్రపంచం మొత్తం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం(Oscar Awards Ceremony) గ్రాండ్గా జరిగింది. 97వ ఆస్కార్ అకాడమీ(Oscar Academy) అవార్డుల కోసం హాలీవుడ్(Hollywood) తారలు, సినీప్రముఖులు భారీగా హాజరయ్యారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్లో డాల్బీ థియేటర్లో(Dolby Theatre) ఈ వేడుక అట్టహాసంగా నిర్వహించారు.







కాగా 2025 ఏడాదికి గానూ బెస్ట్ యానిమేటెడ్ మూవీగా ఫ్లో విజేతగా నిలిచింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్-కీరెన్ కల్కిన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్-పాల్ తేజ్వెల్ (వికెడ్), బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ప్లే-కాంక్లేవ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే-సీన్ బేకర్ (Anora), బెస్ట్ ఎడిటింగ్-సీన్ బేకర్ (అనోరా), బెస్ట్ మేకప్, హెయిర్ స్టైల్-ది సబ్స్టాన్స్ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కింది. ఏఏ కేటగిరీలో ఎవరికి అవార్డు దక్కిందో చూసేయండి..
ఆస్కార్-2025 విన్నర్స్ వీరే..
☛ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: కీరెన్ కల్కిన్ (A Real Pain)
☛ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ఫ్లో
☛ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ఇన్ ది షాడో ఆఫ్ ది సిప్రెస్
☛ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: పాల్ తేజ్ వెల్ (వికెడ్)
☛ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే: సీన్ బేకర్ (Anora)
☛ ఉత్తమ అడాప్డెడ్ స్క్రీన్ప్లే: పీటర్ స్ట్రౌఘన్ (Conclave)
☛ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: పీరేఒలివర్ పెర్సిన్, స్టీఫనీ గ్వీల్లన్, మరిలీన్ స్కార్సెలీ (ది సబ్స్టాన్స్)
☛ ఉత్తమ ఎడిటింగ్: సీన్ బేకర్ (Anora)
☛ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: (ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కె్స్ట్రా)
☛ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: (No Other Land)
☛ బెస్ట్ సౌండ్: Dune Part-2
☛ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: Dune Part-2
☛ బెస్ట్ ఒరిజినల్ సాంగ్: ఎల్ మల్ (ఎమిలియా పెరెజ్)
☛ ఉత్తమ సహాయ నటి: జోయ్ సల్దానా, (ఎమిలియా పెరెజ్)
☛ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: నాథన్ క్రౌలీ, లీ శాండెల్స్ (వికెడ్)
☛ ఉత్తమ నటి – మైకీ మ్యాడిసన్ (అనోరా)

☛ ఉత్తమ నటుడు – ఆడ్రిన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
Oscars 2025 Oscars: Best Picture, Best Director, Best Actor, Best Actress & more | See full list of winners
OTRC logo
Monday, March 3, 2025 4:46AMLive Updates: Biggest moments from 97th Academy Awards and Oscar after parties
Check out the full list of 2025 Oscar nominations… pic.twitter.com/8Ol7HDVals
— Joe Crack (@JOECRACK001) March 3, 2025








