
బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్(BiggBoss). ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. తెలుగులోనూ ఈ షో ఫస్ట్ సీజన్ నుంచే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో కూడా ఇప్పటికే 8 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక త్వరలోనే తొమ్మిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు నిర్వాహకులు అందుకు తగ్గ ఏర్పాట్లు షురూ చేసినట్లు తెలుస్తోంది. అయితే 9వ సీజన్‌కు సంబంధించి మరో క్రేజీ న్యూస్ బయటికొచ్చింది.
ఆరు సీజన్లకు హోస్టుగా నాగ్ సక్సెస్
ఇప్పటికే Bigg Boss-9లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక(Selection of contestants) ప్రక్రియ మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి హోస్టుగా అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) వ్యవహరించడం లేదంటూ ఓ న్యూస్ వైరలవుతోంది. మొదటి సీజన్ NTR, 2వ సీజన్‌కు నాచురల్ స్టార్ నాని(Nani) హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ సూపర్ సక్సెస్ చేశారు. అయితే నెక్ట్స్ సీజన్‌కు నాగ్ దూరం కానున్నారట. ఆయన ప్లేస్‌లో ఓ యంగ్ హీరో హోస్టుగా వ్యవహరించే ఛాన్సుందని టీటౌన్ వర్గాలు పేర్కొన్నాయి.
VDని సంప్రదించిన బిగ్‌బాస్ నిర్వాహకులు?
యూత్‌లో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఈ కార్యక్రమానికి హోస్టు(Host)గా వ్యవహరించబోతున్నారంటూ వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే బిగ్‌బాస్ మేకర్స్(Bigg Boss Makers) కూడా విజయ్ దేవరకొండను సంప్రదించడంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానున్నట్లు సమాచారం.