
వేసవి(Summer) ముందు వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం నాని నిర్మాతగా చేసిన ‘కోర్ట్’, కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’, ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు, వెబ్ సిరీస్(Web Series)లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
థియేటర్‌లోకి రానున్న సినిమాలివే..
థియేటర్‌లో రిలీజ్ అయి సందడి చేయనున్న సినిమాల లిస్ట్ చూస్తే ముందుగా నాని నిర్మాతగా, రామ్ జగదీశ్ దర్శకత్వంలో రూపొందిన కోర్టు సినిమా మార్చి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక కిరణ్ అబ్బవరం, దర్శకుడు విశ్వకరుణ్ కాంబోలో వస్తున్న దిల్ రూబా మార్చి 14న రిలీజ్ కానుంది.
ఈవారం OTTలోకి రానున్న మూవీలు, వెబ్ సిరీస్‌లివే
✦ SonyLIV: ఏజెంట్ (తెలుగు)- మార్చి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
✦ Netflix: అమెరికన్ మ్యాన్ హంట్ (డాక్యుమెంటరీ సిరీస్)- మార్చి 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
✦ Amazon Prime: వీల్ ఆఫ్ టైమ్ 3 (వెబ్‌సిరీస్) – మార్చి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే బీ హ్యాపీ (హిందీ) మార్చి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
✦ ZEE5: ఇన్ గలియోంమే (హిందీ)- మార్చి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
✦ Apple TV Plus: డోప్‌థీప్ (వెబ్‌సిరీస్) – మార్చి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
✦ ETV WIN: పరాక్రమం (తెలుగు) – మార్చి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే రామం రాఘవం (తెలుగు) – మార్చి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. వీటితోపాటు మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి.