Mana Enadu: భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace Prize)కి అర్హుడని ప్రముఖ బిజినెస్‌మెన్, ఇన్వెస్టర్ మార్క్ మోబియన్(Mark Mobius) అన్నారు. ప్రపంచ వేదికపై మోదీ విశేష కృషి చేస్తున్నారని మార్క్ కొనియాడారు. ముఖ్యంగా రాజకీయ, దౌత్య పరం(Political and diplomatic)గా ఆయన అన్ని దేశాలను సమన్వయ పరుస్తున్నారని ప్రశంసించారు.
తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న 88 ఏళ్ల మోబియస్ మోదీపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రష్యా మధ్య ఉక్రెయన్ యుద్దం(Ukrainian-Russia war), పశ్చిమాసియాలో ఘర్షణ(Conflicts in West Asia)లను మోదీ చర్చలు జరిపి వాటిని శాంతియుతంగా మార్చగలిగే సమర్థుడని కొనియాడారు. ఇందుకు మోదీ చొరవ చూపాలని సూచించారు.
అన్ని వర్గాలతో మాట్లాడగలిగే సమర్థుడు
“భారత ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి. ఆయన చాలా మంచి వ్యక్తి. అంతర్జాతీయంగా అతని పాత్ర, ముందుకు సాగడానికి ప్రాధాన్యత పెరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతను ప్రపంచవ్యాప్తంగా రాజకీయంగా అన్ని వర్గాలతో మాట్లాడగల సమర్థుడు. ప్రపంచాన్ని శాంతియుతంగా నడపడానికి ముందుంటారు” అని మోబియస్ అన్నారు.
#PMModi can win #NobelPeacePrize, says #MarkMobius.
Read: https://t.co/EPudwNmvpE pic.twitter.com/jSL27zhgKg
— NDTV Profit (@NDTVProfitIndia) November 12, 2024
అందరికీ న్యాయం చేయగల ఏకైక దేశం
మోబియస్(Mark Mobius) ఇంకా ఏమన్నారంటే.. నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace Prize) విషయానికి వస్తే, PM మోదీ ‘దేనినైనా అందుకోవడానికి అర్హుడు. ఈ ప్రపంచ అవార్డుకు మోదీ అర్హుడు. భారత్ ప్రపంచాన్ని తటస్థంగా ఉంచడానికి, అందరికీ న్యాయం చేయగల ఏకైక దేశం. ప్రపంచ వేదికపై శాంతికి మధ్యవర్తిగా వ్యవహరించడానికి భారత్ సరైనది’ అని మోబియస్ IANSతో చెప్పారు. కాగా 1992లో దౌత్య సంబంధాల స్థాపన తర్వాత ఓ భారత ప్రధానిగా మోదీ ఉక్రెయిన్‌లో తొలిసారి పర్యటించారు.