పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ (The Raja Saab) చేస్తూనే.. మరోవైపు హను రాఘవపూడితో ఇంకో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగు కూడా ప్రారంభమైంది. ఇవే కాకుండా డార్లింగ్ చేతిలో సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, ప్రశాంత్ వర్మతో బక (ప్రచారంలో ఉన్న టైటిల్) నాగ్ అశ్విన్ తో కల్కి-2, ప్రశాంత్ నీల్ తో సలార్-2 ఉన్నాయి.
స్పిరిట్ మూవీ లేటెస్ట్ అప్డేట్
అయితే ప్రస్తుతం ది రాజాసాబ్, హను రాఘవపూడి (Hanu Raghavapudi) సినిమాలపై ఫోకస్ పెట్టిన ప్రభాస్ ఈ రెండు సినిమాల షూటింగులో పాల్గొంటున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు చిత్రాలు సెట్లో ఉండగానే మరో మూవీ సెట్ లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడట. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్ (Spirit)’ మూవీ షూటింగులో త్వరలో ప్రారంభం కానుందట. పవర్‌ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది.
జూన్ నుంచి స్పిరిట్ షూట్
ఇక జూన్ నుంచి స్పిరిట్ రెగ్యులర్ షూటింగు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ మూవీలో ప్రభాస్ ను సందీప్ ఓ పవర్ ఫుల్ పోలీసు పాత్రలో చూపించనున్నారు. డార్లింగ్ మొదటి సారి ఖాఖీ యూనిఫామ్ లో కనిపించబోతుండటంతో ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక యానిమల్ తో ఊరమాస్ యాక్షన్ చూపించిన సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga).. డార్లింగ్ తో ఎంతటి యాక్షన్ చేయిస్తాడోనని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మిగతా క్యాస్ట్, టెక్నికల్ టీమ్, స్టోరీ లైన్ పై చిత్రబృందం ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.






