ZEE5: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’.. కానీ!

ఈ సంక్రాంతి పండక్కి వచ్చి ఫ్యామిలీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’. విక్టరీ వెంకటేశ్(Venkatesh) హీరోగా ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎనర్జిటిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దిల్ రాజు(Dil Raju), శిరీశ్ సంయుక్తంగా రూ.55 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ ఇప్పటికే రూ.230కోట్లకు పైగా వసూల్ చేసింది. దీంతో వెంకటేశ్ సినీ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు(Highest Collections) రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ ఈ మూవీకి హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ఆ వార్తతో మేకర్స్ ఆందోళన

తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌(OTT Streaming)‌పై వార్త సినీటౌన్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికీ థియేటర్స్‌లో విజయవంతంగా నడుస్తున్న సమయంలోనే ఓటీటీ వస్తోందన్న న్యూస్‌తో మేకర్స్‌ కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ZEE5 సొంతం చేసుకుంది. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ఫిబ్రవరి ఫస్ట్ హాఫ్‌లో స్ట్రీమింగ్‌ చేయాల్సి వస్తుంది.

ఒప్పందం ప్రకారమే స్ట్రీమింగ్?

అయితే ఇంకా థియేటర్‌(Theatres)కు జనాలు వస్తుండటంతో OTT విడుదల తేదీలో మార్పు చేయమని దర్శక, నిర్మాతలు ఓటీటీ సంస్థను అభ్యర్థిస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే జీ5 మాత్రం అందుకు సిద్ధంగా లేదని తెలిసింది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారమే స్ట్రీమింగ్ చేస్తామని చెప్పడంతో నిర్మాత ‘దిల్‌’రాజు, ఎలాగైనా ఓటీటీ స్ట్రీమింగ్‌ తేదీని మార్చాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడంటూ టీటౌన్‌లో వినికిడి. మరి దీనిపై తర్వలోనే క్లారిటీ రావాల్సి ఉంది.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *