Fatima Sana: సౌత్ సినిమాల్లో కాస్టింగ్ కౌచ్.. దంగల్ నటి సంచలన కామెంట్స్

‘దంగల్(Dangal)’ సినిమాలో తన ఉడుం పట్టుతో రింగులో ప్రత్యర్థిని గింగిరాలు తెప్పింది నటి ఫాతిమా సనా షేక్(Fatima Sana Shaikh). బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖార్ నటించిన ‘దంగల్’ సినిమాలో గీతా ఫొగట్(Geeta Phoghat) క్యారెక్టర్ చేసింది ఫాతిమా. రెజ్లింగ్(Wrestling) నేపథ్యంలో సాగిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ ఈ మూవీ రికార్డులు పదిలంగానే ఉన్నాయంటేనే దంగల్ ఏ రేంజ్‌లో అభిమానులను అలరించిందో. కాగా ఫాతిమా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరీర్ ప్రారంభంలో సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను షేర్ చేసుకుంది సనా.

కష్టపడి సంపాదించుకున్నా దోచుకుంటారు..

కొందరు డైరెక్టర్లు కమిషన్ పేరుతో డబ్బులు దోచుకునే వారని ఆరోపించింది. ఇండస్ట్రీ(Industry)లో కష్టపడి సంపాదించుకున్న డబ్బును కూడా దోచుకునే వ్యక్తులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతకాకుండా తన కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్ కౌచ్(Casting couch) అనుభవానలకు కూడా ఫాతిమా ఇంటర్వ్యూలో పంచుకుంది. ఓ డైరెక్టర్‌(Director)తో తనకు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది సనా. మీరు ఏదైనా చేయడానికి సిద్ధమా? అని ఆ డైరెక్టర్ తనను అడిగారని చెప్పింది. అయితే తాను కష్టపడి పని చేస్తానని, పాత్రకు అవసరమైనది చేసేందుకు 100% ఎఫర్ట్ పెడతానని అతడితో చెప్పినట్లు తెలిపింది. కానీ అతను దిగజారిపోయి మాట్లాడారని షాకింగ్ కామెంట్స్ చేసింది.

In Pics: 'दंगल' फेम ऐक्ट्रेस फातिमा सना शेख के हॉट अवतार को देख फैंस हुए  दीवाने | Dangal fame actress Fatima Sana Shaikh fans went crazy after  seeing the hot avatar

అక్కడ కాస్టింగ్ కౌచ్‌పై ఓపెన్‌గా మాట్లాడుతారు..

అంతేకాదు హైదరాబాద్‌(HYD)లో పలువరు చిన్న నిర్మాతలను కలుసుకున్న ఘటనలను గుర్తు చేసుకుంది ఫాతిమా. బాలీవుడ్‌(Bollywood)లో మంచి పాత్రలు రావడానికి సౌత్ ఇండియా సినిమా మొదటి అగుడు అని తాను నమ్ముతున్నానని వెల్లడించింది. అయితే ‘‘అక్కడ కొందరు నిర్మాతలు(Producers) కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. మీకు తెలుసా, ఇక్కడ మీరు కొందరిని కలవాల్సి ఉంటుంది. విషయం పూర్తిగా చెప్పరు కానీ వింత రూపాల్లో దానిని మనకు సూచిస్తారు. పరోక్షంగా మనకు చెబుతారు. వారి ఉద్దేశాలను మనకు స్పష్టం చేస్తారు. అయితే అందరూ అలా ఉండరని కూడా ఫాతిమా క్లారిటీ ఇచ్చింది’’. కాగా కాస్టింగ్ కౌచ్‌పై సనా చేసిన కామెంట్స్ మరోసారి సౌత్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *