Mana Enadu:Sarfaraz Khan: టీమ్ఇండియా(Team India) యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) తండ్రయ్యాడు. తన భార్య తాజాగా ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తన కొడుకుని ఎత్తుకొని దిగిన ఫొటోను ట్విటర్(X)లో ‘ఇట్స్ ఏ బాయ్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. ఆ పిక్‌లో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్(Naushad Khan) కూడా నవ్వుతూ కన్పించారు. ఈ ఫొటో క్షణాల్లోనే వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 26 ఏళ్ల సర్ఫరాజ్ గతేడాది ఆగస్టు 6న రొమానా జహూర్‌ను J&Kలో వివాహమాడారు. కాగా ఇటీవల బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలిటెస్టులో సర్ఫరాజ్ అద్భుత సెంచరీ(150)తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పరుగుల వరద
సర్ఫరాజ్ ఖాన్ టీమ్ఇండియా కెరీర్ విషయానికి వస్తే ఇప్పటివరకు భారత్ తరఫున 4 టెస్టులు ఆడాడు. ఇందులో 325 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League)లో దాదాపు 50 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 585 పరుగులు చేసి రాణించాడు. సర్ఫరాజ్ ఇప్పటి వరకూ 52 ఫస్ట్ క్లాస్(First Class Matches) మ్యాచ్‌లలో ఏకంగా 69.27 సగటు(AVG)తో 4572 రన్స్ చేశాడు. అందులో 16 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
జట్టులో చోటు పదిలమేనా..
ఇప్పుడు టీమ్ఇండియాలోనూ అతడు చోటు ఖాయమైనట్లే. ఇంగ్లండ్(England)తో తొలిసారి అవకాశం దక్కించుకున్న అతడు నిలకడగా రాణించాడు. బంగ్లాదేశ్(Bangladesh)పై ఆడే అవకాశం రాకపోయినా.. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ గాయపడటంతో తొలి టెస్టు(First Test)లో ఆడే ఛాన్స్ దక్కింది. అందులో సెంచరీ(Century) చేసి ఇక టీమ్ తనను పక్కన పెట్టే సాహసం చేయకుండా చేసుకున్నాడు.








