టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల-2 (Odela 2). అశోక్ తేజ తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో ఈ టీజర్ ను విడుదల చేశారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సంపత్ నంది టీమ్ వర్క్స్‌తో కలిసి మధు క్రియేషన్స్ పతాకంపై డి.మధు నిర్మిస్తున్నారు.
ఓదెల 2 టీజర్ రిలీజ్
ఈ టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. ఇందులో శివశక్తిగా తమన్నా నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంది. ఉత్కంఠ రేకేత్తించే సన్నివేశాలతో టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. 2022లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే.






