ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైలులో అందుబాటులోకి బేబీ బెర్తులు

Mana Enadu: దూరప్రాంతాలకు ప్రయాణించాలంటే మధ్యతరగతి వాళ్లకు బెస్ట్ ఆప్షన్ రైలు ప్రయాణం. అయితే రైలు ప్రయాణం కాస్త చౌకే అయినా రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేస్తే మాత్రం కష్టపడుతూ ప్రయాణించాల్సిందే. అయితే రైలులో పిల్లలను కూడా తీసుకుని ప్రయాణం చేస్తే వారి కోసం స్పెషల్ బెర్తులు రిజర్వ్ చేయాలి. ఒకవేళ చేసినా కొంతమంది తల్లిని వదిలి వేరే బెర్తులో ఉండలేరు. అలాగని దూర ప్రయాణాల్లో తల్లులు పిల్లలతో కలిసి ఒకే బెర్తులో ప్రయాణం చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది.

రైల్వే ప్రయాణికులు ముఖ్యంగా మహిళా ప్యాసెంజర్స్ పడుతున్న ఈ సమస్యకు భారతీయ రైల్వే సంస్థ ఓ చక్కని ఉపాయాన్ని ఆలోచించింది. ఎల్లప్పుడూ ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంత ప్రయాణం అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్న రైల్వేశాఖ .. తల్లుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే పిల్లల కోసం బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు.

ట్రైన్‌ కోచ్‌లలో బేబీబెర్త్‌లను అమర్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందా..? అని బీజేపీ ఎంపీ సమర్ సింగ్ సోలంకీ ప్రశ్నించగా.. మంత్రి స్పందిస్తూ.. లక్నో మెయిల్‌లో రెండు బేబీ బెర్త్‌లను ప్రయోగాత్మకంగా తీసుకువచ్చినట్లు చెప్పారు. లఖ్‌నవూ మెయిల్‌లోని ఒక కోచ్‌లో రెండు దిగువ బెర్త్‌లకు వాటిని అమర్చామని దీనిపై వచ్చిన ఫీడ్‌బ్యాక్‌లో ప్రశంసలు అందాయని పేర్కొన్నారు.  సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గడం వంటి సమస్యలు తమ దృష్టి వచ్చాయని.. ప్యాసింజర్ కోచ్‌లలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయని.. అది నిరంతర ప్రక్రియ అని మంత్రి చెప్పుకొచ్చారు.

బేబీ బెర్తులు.. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్నపాటి బెడ్స్ అన్నమాట. తల్లి పక్కనే బిడ్డ నిద్రించేలా ఇవి లోయర్‌ బెర్త్‌కు అటాచ్‌ అయి ఉంటాయి. ప్రయాణ సమయంలో తల్లులు ఈ బెర్త్‌పై తమ చిన్నారులను పడుకోబెట్టుకోవచ్చు. సాధారణంగా అయితే.. ఒకే బెర్త్‌పై తల్లీబిడ్డా సర్దుబాటు కావాల్సి ఉంటుంది. ఒకే బెర్తులో ఇద్దరికి స్థలం సరిపడక.. ఇబ్బందిగా ఉండేది. ఈ క్రమంలోనే ప్రయాణికుల నుంచి విజ్ఞప్తులతో రైల్వే శాఖ ఈ సమస్యకు ఓ పరిష్కార మార్గాన్ని కనిపెట్టింది. ఇప్పుడు బేబీ బెర్త్‌ సాయంతో పిల్లల్ని తమ పక్కనే సురక్షితంగా పడుకోబెట్టొచ్చు. అవసరం లేనప్పుడు దీన్ని లోయర్‌ బెర్త్‌ కిందికి ఫోల్డ్ కూడా చేసేయొచ్చు. అయితే పిల్లలు కింద పడకుండా సురక్షితంగా ఉంచడానికి ఈ బెర్త్ చుట్టూ సేఫ్టీ బెల్ట్స్ కూడా ఉన్నాయి. 

 

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *