Mana Enadu:శ్రావణమాసం అంటే హిందువులకు చాలా ఇష్టమైన నెల. ఈ నెలలో చాలా మంది లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ నెలలో మహిళలు వ్రతాలతో బిజీబిజీగా గడుపుతుంటారు. కొందరైతే ప్రముఖ దేవాలయాలు దర్శించుకునేందుకు ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా శ్రావణమాసంలో పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవాలని అనుకుంటున్నారా మీ కోసమే ఐఆర్సీటీసీ తక్కువ ధరకే దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ్ పేరుతో అదిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ యాత్రలో భాగంగా సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో రైలు ఎక్కొచ్చు. ఈ టూర్ మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లు ఉంటుంది. మరి ఈ ప్యాకేజీ వివరాలు తెలుసుకుందామా..?
DAY -1 : సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు.
DAY -2 : హోటల్ లో ఫ్రెష్ అయిన తర్వాత అరుణాచలం ఆలయం దర్శించుకున్న తర్వాత రైల్వే స్టేషన్‌కు వచ్చి కుదాల్నగర్ స్టార్ట్ అవుతారు.
DAY -3 : ఉదయం కుదాల్నగర్ చేరుకుని రోడ్డు మార్గం ద్వారా రామేశ్వరం వెళ్తారు. అక్కడ హోటల్ లో ఫ్రెషప్ అయి స్థానిక పుణ్యక్షేత్రాలను దర్శించుకుని సాయంత్రం తిరిగి హోటల్‌కు చేరుకుంటారు.
DAY -4 : నాలుగోరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత రామేశ్వరం నుంచి బస్సు ప్రయాణం ద్వారా మదురైకి వెళ్లి సాయంత్రం మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని కుదాల్నగర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి కన్యాకుమారికి రైల్లో బయల్దేరతారు.
DAY -5 : ఐదో రోజు ఉదయం కొచ్చువేలి స్టేషన్‌కు నుంచి రోడ్డు మార్గం ద్వారా కన్యాకుమారి వెళ్తారు. హోటల్లో చెకిన్ అయ్యి ఫ్రెషప్ అయిన తర్వాత రాక్ మెమోరియల్, గాంధీ మండపం సందర్శించారు. ఈ టూర్ లో హైలైట్ అంటే కన్యాకుమారి సన్ సెట్ పాయింట్. సన్ సెట్ ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకుంటారు.
DAY -6 : మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి రోడ్డు మార్గం ద్వారా త్రివేండ్రం వెళ్లి పద్మనాభ స్వామి ఆలయం దర్శించుకుని కొద్దిసేపు కోవలం బీచ్‌లో జాలీగా గడుపుతారు. అక్కడి నుంచి కొచ్చువేలి స్టేషన్‌కు వెళ్లి తిరుచిరాపల్లి బయలుదేరుతారు.
DAY -7 : మరుసటి రోజు ఉదయం తిరుచిరాపల్లి చేరుకుని హోటల్లో ఫ్రెషప్ అయి శ్రీరంగం టెంపుల్ వెళ్లి తర్వాత తంజావూర్ లో బృహదీశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌కు తిరుగుప్రయాణమవుతారు.
DAY -8 & DAY – 9 : రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట మీదుగా 9వ రోజు ఉదయం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో ఈ టూర్ పూర్తవుతుంది.
ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి..
ఎకానమీ: పెద్దలకు రూ.14,250, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.13,250
స్టాండర్డ్: పెద్దలకు రూ.21,900, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.20,700
కంఫర్ట్: పెద్దలకు రూ.28,450, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.27,010