రావణకాష్టంలా బంగ్లాదేశ్.. అల్లరిమూకల చేతుల్లో హసీనా పార్టీ నేతల ఊచకోత

Mana Enadu:బంగ్లాదేశ్ రావణకాష్టంలా మారింది. అల్లరిమూకలు చెలరేగి విధ్వంసం సృష్టిస్తున్నారు. షేక్ హసీనా రాజీనామాతో అయినా అల్లర్లు తగ్గుముఖం పడతాయనుకుంటే.. హింస మరింత పెరిగిపోయింది. ఇప్పటిక జరిగిన హింసాకాండల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మాజీ ప్రధాని హసీనా దేశం వదిలి వెళ్లిన తర్వాత ఆమె పార్టీ అయిన అవామీ లీగ్ నేతలను అల్లరిమూకలు వెంటాడి వేటాడి చంపేస్తున్నారు.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని అవామీ లీగ్ నేతలపై ఆందోళనకారులు అతికిరాతకంగా దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటి వరకు ఆ దేశవ్యాప్తంగా 29 మంది మృతదేహాలను గుర్తించగా.. అందులో 20 అవామీ లీగ్‌ నేతలవేనని స్థానిక మీడియా వెల్లడించింది. 

ఆదివారం నుంచి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు అవామీ లీగ్‌తో సంబంధాలు ఉన్నవారిపై విరుచుకుపడి వెంటాడి మరీ వారిని ఊచకోత కోశారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయగానే .. ఆమె మద్దతుదారులపై దాడులకు పాల్పడి చంపేస్తున్నారు. ఈ ఘటనల్లో యువ నటుడు శాంతో, దర్శకుడైన అతడి తండ్రిని అతికిరాతకంగా హతమార్చారు. నిరసనకారులు వీరిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అయితే ఈ నటుడు గతంలో హసీనా తండ్రి షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ బయోపిక్‌లో నటించడం గమనార్హం.

మరోవైపు బంగ్లా ప్రజలు ప్రేమగా రాహుల్ దా అని పిలుచుకునే ప్రముఖ సంగీతకారుడు, జానపద గాయకుడు రాహుల్ ఆనందో నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మరోవైపు జషోర్‌ జిల్లాలో అవామీలీగ్‌ నేతకు చెందిన హోటల్‌కు అల్లరిమూకలు నిప్పుపెట్టిన ఘటనలో 24 మంది సజీవ దహనమయ్యారు. మూడు వారాల ఆందోళనల్లో ఇప్పటివరకు 440 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఒక్కరోజే 109 మంది మరణించారు. బంగ్లాదేశ్ లో అల్లరిమూకలు పాల్పడుతున్న హింసను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. 

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *