KTR: బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనమంటూ పుకార్లు.. కేటీఆర్ ఫైనల్ వార్నింగ్ ఇదే!

Mana Enadu:రాజ‌కీయాల్లో ఏమైనా జ‌రగొచ్చు.. నిన్న‌టి మాట నేడు మారిపోవ‌చ్చు. నిన్న ప‌రిస్థితి రేపు ఉండక‌పోవ‌చ్చు. సో.. రాజకీయాల్లో నాయ‌కుల‌కు వ్యూహాలు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతుంటాయి. తెలంగాణ ఉద్య‌మం కోసం.. అలుపెరుగ‌ని పోరాటం చేసిన క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు (KCR) ఈ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్ర‌స‌మితి(TRS) పార్టీని స్థాపించి.. ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. రాష్ట్రాన్ని సైతం ఇదే పేరుతో సాధించారు. వ‌రుస‌గా రెండు సార్లు తెలంగాణ‌లో ఆయ‌న అధికారంలోకి కూడా వ‌చ్చారు. అయితే.. ఆ తర్వాతే సీన్ మారింది. కట్ చేస్తే మూడో దఫా ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకుంది.

 కారణాలు అనేకం.. 

ఇందుకు కారణాలు లేకపోలేదు. రెండో ద‌ఫా అధికారంలోకి వ‌చ్చాక కేసీఆర్‌.. త‌న పార్టీని జాతీయ స్థాయి(National Politics)లో విస్త‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే టీఆర్‌ఎస్‌ను కాస్తా.. భార‌త రాష్ట్ర‌ స‌మితి(BRS)గా మార్చారు. ఈ పార్టీని దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారంలోకి తీసుకువ‌చ్చి 2024 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌ను కూడ‌గ‌ట్టి తృతీయ ప‌క్షం ఏర్పాటుకు వ్యూహం సిద్ధం చేశారు. కానీ ఈ నిర్ణయమే ఆ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి అసలైన కారణమని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.

 పడతాం.. లేస్తాం.. తెలంగాణ కోసమే పోరాడతాం: KTR

తాజాగా ఓ వార్త సోషల్ మీడియా(social media)లో చక్కర్లు కొడుతోంది. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారంటూ గత రాత్రి నుంచి ఓ ఛానల్‌లో బిగ్ బ్రేకింగ్ రావడం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిరాధార వార్తలు, పుకార్లు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘‘పడతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతాం. కానీ తలవంచం. ఎప్పటికైనా, ఎన్నటికైనా జై తెలంగాణ’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

‘‘ఇప్పుడు చెబుతున్నాం… కుట్రపూరితమైన అజెండాలతో, నిరాధారమైన, పుకార్లు వ్యాపింపజేసేవారికి ఇదే ఆఖరి హెచ్చరిక. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మీరు సృష్టించిన తప్పుడు వార్తలకు సవరణగా ఒక ప్రకటన విడుదల చేయండి. లేదా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు సేవలందిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇకపైనా అదే పంథా కొనసాగిస్తుంది. ఆధారాలు లేకుండా పుకార్లు ప్రచారం చేయడం ఇకనైనా ఆపండి” అంటూ కేటీఆర్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.

https://x.com/KTRBRS/status/1821107439023862254

Share post:

లేటెస్ట్