ManaEnadu:టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన మెరుగైన ఆటతో కింగ్ అనే బిరుదును సంపాదించుకున్న విషయం తెలిసిందే. అందుకే విరాట్ ఫ్యాన్స్ తనను ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకుంటారు. అయితే కేవలం ఆటలోనే కింగ్ కాదు.. ఫిట్నెస్, వ్యక్తిగత డిసిప్లెన్ వంటి చాలా అంశాల్లో కోహ్లీ తాను నంబర్ వన్ అని నిరూపించుకున్నాడు. ఇక తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.66 కోట్ల పన్నును చెల్లించి క్రీడాకారుల్లోనే హైయ్యెస్ట్ టాక్స్ పేయర్ (Tax Payer)గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకూ క్రీడాకారులు కట్టిన ట్యాక్సుల్లో ఇదే అత్యధికం.
మాజీ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ (MS Dhoni) (రూ.38 కోట్లు), సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) (రూ.28 కోట్లు), సౌరభ్ గంగూలీ (రూ.23 కోట్లు) హైయ్యెస్ట్ ట్యాక్స్ కట్టారు. వారందరినీ నెట్టి విరాట్ మొదటి స్థానానికి చేరుకున్నాడు. భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardhik Pandya) గతంలో రూ.13 కోట్లు పన్నుగా చెల్లించారంటూ ప్రముఖ సంస్థ ఫార్చ్యున్ ఇండియా తాజాగా తమ నివేదికలో పేర్కొంది.
మరోవైపు ట్యాక్స్ పేమెంట్‌లో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shahrukh Khan) అధిగమించాడు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విరాట్ కోహ్లీ రూ. 66 కోట్లు ట్యాక్స్ కడితే.. షారుక్ ఏకంగా రూ.92 కోట్లు ట్యాక్స్ కట్టాడు. ఇక ఈ లిస్టులో విజయ్ రూ. 80 కోట్లు, సల్మాన్ ఖాన్ రూ. 75 కోట్లు చెల్లించినట్లు ఫార్చూన్ ఇండియా (Fortune India) సంస్థ వెల్లడించింది.
భారతీయ సెలబ్రిటీలందరిలో రూ.92 కోట్లతో షారుక్ అత్యధికంగా పన్ను చెల్లించినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ లిస్టులో షారుక్ మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) (రూ.80 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.75 కోట్లు) బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (రూ.71 కోట్లు) చెల్లించారు. వారి తర్వాత రూ.66 కోట్లతో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు.