TG:తెలంగాణలో భారీ వర్షాలు.. 2న విద్యాసంస్థలకు సెలవు

ManaEnadu:తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వానలు (Telangana Heavy Rains) కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి వరద చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. మరోవైపు ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ (Telangana Red Alert) జారీ చేసింది. సోమవారం (సెప్టెంబరు 2వ తేదీ) కూడా వానలు భారీగా కురవనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో సోమవారం (సెప్టెంబరు 2) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల (Schools Holiday)కు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అప్పటి వరకు ప్రజలెవరూ బయటకు వెళ్లొద్దని సూచించింది. అత్యవసర సమయాల్లో తప్ప ఇంటి గడప దాటొద్దని పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన సర్కార్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. 

మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం పలు సూచనలు చేసింది. పలుచోట్ల రహదారులపై భారీగా వరద (Telangana Floods) ప్రవహిస్తోందని .. వరద ఉన్నచోట ఎవరూ రోడ్డు దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటికి రావొద్దని తెలిపింది. ముఖ్యంగా ప్రవహిస్తున్న వాగు ఉన్న వంతెనలపైన ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణించొద్దని పేర్కొంది. 

ఇక భారీ వర్షాల కారణంగా సూర్యాపేట వద్ద విజయవాడ-హైదరాబాద్‌ (Hyderabad-Vijayawada High Way) జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌ 65)పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి – అద్దంకి, ఖమ్మం వైపు దారి మళ్లిస్తున్నారు. ఇంకోవైపు హుజూర్‌ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పలు కాలనీలు నీట మునిగాయి. నల్గొండ జిల్లా (Nalgonda Rains) మిర్యాలగూడలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *