పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) వల్ల జమ్ము కశ్మీర్ పర్యటకంపై తీవ్ర ప్రభావం పడింది. భయంతో చాలా మంది ప్రజలు అక్కడికి వెళ్లడానికి భయపడుతున్నారు. మరోవైపు జమ్ముకశ్మీర్ లో ఇంకా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం 87 పర్యటక ప్రాంతాల్లో (Jammu Kashmir Toursim) 48 ప్రదేశాలను మూసివేసింది. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని భద్రతా ఏజెన్సీల హెచ్చరికలతో జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కశ్మీర్ పై ఉగ్ర నీడలు
కశ్మీర్ లోయలో కొంత మంది స్లీపర్ సెల్స్ యాక్టివ్ (Sleeper Cells in Kashmir) అయి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు భద్రతావర్గాలకు సమాచారం అందింది. ఉత్తర, మధ్య, దక్షిణ కశ్మీర్ ప్రాంతాల్లో భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా శ్రీనగర్, గండేర్బల్ ప్రాంతంలోని కశ్మీర్ పండిట్లు, అధికారులు, లోయలోని రైల్వే సిబ్బంది, మౌలిక సదుపాయాలపైనా దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. మరోవైపు ఇంటిలిజెన్స్ సమాచారంతో అప్రమత్తమైన భద్రతాదళాలు, సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాయి.
టెర్రర్ అటాక్ అలర్ట్
జమ్ముకశ్మీర్ లో ఇంకా ఉగ్రవాద నీడలు (Terror Attack ALert) కమ్ముకునే ఉన్నాయి. మాకు అందిన సమాచారం ప్రకారం ఉత్తర, మధ్య, దక్షిణ కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కశ్మీర్ పండిట్ లు, అధికారులు, రైల్వే అధికారులతో పాటు సిబ్బందిని టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీరంతా క్యాంపులు, బ్యారక్‌లను విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దు. అని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.






