Salaar Movie: ఫ్యాన్స్ బీ రెడీ.. ఇంకో 50 రోజుల్లోనే థియేటరల్లో ‘సలార్’ సందడి..

ఇప్పటికే విడుదలైన టీజర్ గూస్ బంప్స్ తెప్పించే విజువల్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. భారీ బడ్జెట్‏తో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను రెండు పార్టులుగా రాబోతుంది. ఇక మొదటి పార్ట్ ను డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‏గా రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇంకా మరో 50 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇక ఇదే విషయాన్ని మరోసారి మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ షూరు చేయనున్నట్లు తెలుస్తోంది.

భారీ అంచనాలు.. అంతకు మించిన క్యూరియాసిటీని కలిగించిన చిత్రం సలార్. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది.. తమ ఫేవరేట్ స్టార్ యాక్షన్ డ్రామాను చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కేవలం తెలుగు అడియన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. కేజీఎఫ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి రూపొందించడం.. ఇక ఆయన దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ గూస్ బంప్స్ తెప్పించే విజువల్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. భారీ బడ్జెట్‏తో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను రెండు పార్టులుగా రాబోతుంది. ఇక మొదటి పార్ట్ ను డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‏గా రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇంకా మరో 50 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇక ఇదే విషయాన్ని మరోసారి మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ షూరు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో విలక్షణ నటుడు రాజమన్నార్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. సలర్ సినిమాతో పై మెట్టు ఎక్కబోతున్నాను అంటూ రాసుకొచ్చారు. దీంతో జగ్గుభాయ్ రోల్ గురించి ప్రేక్షకులలో మరింత హైప్ ఏర్పడింది.

ఈ సినిమాను కేజీఎఫ్ మూవీ నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుండగా..రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అయితే గతంలో విడుదలైన కేజీఎఫ్ చిత్రాలకు కంటిన్యూగా ఈ మూవీ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఇందులో యశ్ సైతం కనిపించనున్నాడని అప్పట్లో రూమర్స్ తెగ వైరలయ్యాయి. కానీ దీనిపై ఇప్పటివరకు చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమాను సెకండ్ పార్ట్ రిలీజ్ డేట్ పై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అలాగే ఈ సెకండ్ పార్టులో స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది.

 

 

Share post:

లేటెస్ట్