Cridit Cards: క్రెడిట్ కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో లాభాలేంటో తెలుసా?

ManaEnadu: ఈరోజుల్లో చాలామంది పేమెంట్స్(Payments) కోసం క్రెడిట్ కార్డుల(Credit Cards)ను వాడుతున్నారు. అయితే అలా లావాదేవీలు(Transactions) జరిపే విషయంలో అప్రమత్తం(Alerts)గా ఉండటం చాలా అవసరం. క్రెడిట్ కార్డు విషయాల్లో కూడా అనేక మోసాలు(Frauds) జరుగుతున్నాయి. అయితే అలాంటివి జరగకుండా ఉండాలంటే క్రెడిట్ కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్(Card Protection Plan) తీసుకోవాలి. దీన్ని వేర్వేరు బ్యాంకులు(Banks) అందిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే క్రెడిట్‌ కార్డ్ ప్రొటెక్షన్‌ ప్లాన్‌, మీ క్రెడిట్‌ కార్డుకు బీమా ప్లాన్‌ లాంటిది. మరి దీనివల్ల ఏయే ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

 కార్డు పోయినప్పుడు ఇలా చేయండి
ఒకవేళ మీ క్రెడిట్ కార్డు మిస్(Credit card missing) అయితే.. కస్టమర్ కేర్‌కి కాల్ చేసి కార్డు బ్లాక్(Card Block) చేయమంటారు. మరి ఒకటికి మించి క్రెడిట్ కార్డ్స్ ఉన్నవాళ్ల పరిస్థితి ఏంటి? అప్పుడు వారు వేరువేరు కస్టమర్ కేర్ నంబర్లకు కాల్ చేయాల్సి ఉంటుంది. కానీ CPP ఉంటే ఒక్క సర్వీస్‌ ప్రొవైడర్‌(Service Provider)కు కాల్‌ చేస్తే సరిపోతుంది. ఒక్క ఫోన్‌ కాల్‌తో ప్లాన్‌కు లింక్‌ చేసిన అన్ని కార్డులు బ్లాక్‌ చేస్తారు. మీరు విదేశాలకు వెళ్లినప్పుడు ఒకవేళ మీ క్రెడిట్ కార్డు పోతే CPP అత్యవసర నగదు అడ్వాన్స్‌ను అందిస్తుంది. దీంతో హోటల్ బిల్లులు(Hotel Bills), ప్రయాణ టికెట్లను(Tickets) ఏర్పాటు చేసుకోవచ్చు. 48గంటల్లో మీకు సహాయం అందుతుంది. స్వదేశంలో అయితే 24గంటల సమయమే పడుతుంది. ఇలా వచ్చే డబ్బుకు వడ్డీ కూడా ఉండదు. 28రోజుల్లో ఈ పూర్తి మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది.

 అత్యవసర సమయాల్లో..
అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే మీరు ఎవ్వరిని కూడా అప్పు అడగకుండానే క్రెడిట్‌ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. కార్డు నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సమయం కూడా ఉంటుంది. అటువంటి సమయాల్లో మాత్రమే క్రెడిట్ కార్డ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెడికల్ ఎమర్జెన్సీ(Medical Emergency) విషయంలో ఖాతా(Account)లో డబ్బు లేకపోతే, క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. క్రెడిట్ కార్డ్‌లు, మీ యుటిలిటీ బిల్లులను చెల్లించడానికి, ఇతర చెల్లింపులు చేయడానికి, నగదును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని అందిస్తాయి. ఈ రోజుల్లో యూపీఐ ఆధారిత క్రెడిట్ కార్డ్‌లు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. దీని ద్వారా QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా నేరుగా చెల్లింపు చేయవచ్చు.

 రిజిస్టర్డ్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
☛ ఛార్జీలు: రూ.1200తో CPP వార్షిక ప్రీమియం మొదలవుతుంది. ఇది, ప్రొవైడర్‌ను బట్టి మారుతుంది. దీంతో స్కిమ్మింగ్‌, ఫిషింగ్‌ వంటి మోసపూరిత లావాదేవీల నుంచి బయటపడొచ్చు. ప్రీమియం ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది.
☛ దరఖాస్తు ఎలా?: మీరు ఎంచుకున్న ప్లాన్ కోసం ఓ దరఖాస్తు ఫారంను పూరించి సర్వీస్‌ ప్రొవైడర్‌‌కి ఇవ్వాలి. బ్యాంకు రిజిస్టర్డ్‌ వెబ్‌సైట్‌లో కూడా CPP కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. CPP జారీ చేసేవారు అన్ని బ్యాంకులతో టై-అప్‌ ఉన్నారా లేదా అని ముందే తెలుసుకోవాలి. రియంబర్స్‌మెంట్‌ గురించి కూడా తెలుసుకోవాలి.

Related Posts

ఈ గ్రామంలో ఇల్లు ధర కేవలం రూ.100.. అసలు కారణం ఏంటి?

ఫ్రాన్స్‌లోని పూయ్-డీ-డోమ్ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న పట్టణం అంబర్ట్ (Ambert) స్థానిక జనాభా తగ్గిపోతుండటంతో నూతన నివాసితులను ఆకర్షించేందుకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా, అక్కడి పురాతన ఇళ్లు కేవలం 1 యూరో (రూ.100)కి అమ్మకానికి పెడుతున్నారు.…

మద్యం ప్రేమికులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మద్యం ప్రియులకు(Liquor Lovers) శుభవార్తను అందించింది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో చిన్న స్థాయిలో బీర్(Bear) తయారీ కేంద్రాలైన మైక్రో బ్రూవరీ(Microbreweries)లను స్థాపించేందుకు రాష్ట్ర క్యాబినెట్ అనుమతి తెలిపింది. ప్రతి 5 కి.మీ.కు ఒక మైక్రో బ్రూవరీ అనుమతి!…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *