Akkineni Nagarjuna: కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి.. కోర్టును కోరిన నాగార్జున

ManaEnadu: నటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఆయన ఫ్యామిలీ, హీరోయిన్ సమంత(Samantha)పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సురేఖ చేసిన వ్యాఖ్యలపై మొత్తం సినీ ఇండస్ట్రీ(Film industry) ఆమెపై తీవ్రంగా మండిపడుతోంది. మహిళా మంత్రి అయి ఉండి మరో మహిళపై ఇలాంటి దిగజారుడు ఆరోపణలు ఎలా చేస్తారంటూ పలువురు నటీనటులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున కోర్టు(Court)ను ఆశ్రయించారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా(Defamation suit) వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని.. తన కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్(Petition) దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు(Criminal proceedings) తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.

 ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే సైలెంట్‌గా ఉండం: Jr.NTR

ఈ విషయం మీద Jr.NTR స్పందిస్తూ.. ఓ వ్యక్తి పర్సనల్ జీవితాన్ని ఇలా రాజకీయా(Politics)ల్లోకి లాగడం, వాడుకోవడం చాలా నీచం.. ఎంతో దిగజారుడుతనం అనిపిస్తోంది.. మీలా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం తగదు.. ఎదుటి వారి ప్రైవసీ(Privacy)కి గౌరవం ఇవ్వాలి.. మీరు ఇలా మా ఇండస్ట్రీలోని వ్యక్తుల గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా చెప్పడం మాకు ఎంతో బాధగా ఉంది.. మీరు ఇలా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే.. మేం ఇకపై ఖాళీగా, సైలెంట్‌గా ఉండం అంటూ వార్నింగ్ ఇచ్చాడు యంగ్ టైగర్.

ఓట్లు వేసేది ఇలాంటి మాటల కోసం కాదు: విజయ్ దేవరకొండ

మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యలను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తీవ్రంగా ఖండించారు. “ఏం జరిగిందో దాని గురించి, నేటి రాజకీయాలు, రాజకీయ నాయకులు, వారి ప్రవర్తనపై నా ఆలోచచనలు, భావాలను మంచి భాషలో వ్యక్తీకరించేందుకు కష్టపడుతున్నాను. కొందరు రాజకీయ నాయకులకు నేను ఒకటి గుర్తు చేయాలని అనుకుంటున్నాను. మనల్ని చూసుకునేందుకు మాత్రమే వారికి ఓటు వేస్తున్నాం. మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల గురించి మాట్లాడాటానికి, ఉద్యోగాలు, శ్రేయస్సును తీసుకురావడానికి, ఆరోగ్యం, విద్య, సౌకర్యాలను మెరుగుపరచడం మొదలైన వాటి కోసం ఓట్లు(Votes) వేస్తున్నాం. కానీ ఇలాంటి మాటల కోసం కాదు. ఇక ఈ దిగజారుడు రాజకీయాలు చాలు” అంటూ ట్వీట్ చేశారు.

ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు మానుకోండి: రకుల్ ప్రీత్ సింగ్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakulpreet Singh) ఖండించారు. ‘బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళ ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గపు పుకార్లను వ్యాప్తి చేయడం బాధాకరం. పొలిటికల్ మైలేజీ(Political mileage) కోసం నా పేరును కూడా ఉపయోగించడం మానేయమని నేను కోరుతున్నా. నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని. నాకు ఏ రాజకీయ పార్టీ/వ్యక్తితో సంబంధం లేదు. రాజకీయాలకోసం ఇలాంటి కల్పిత కథలతో ముడిపెట్టడాన్ని ఆపేయాలి’ అని కోరారు. వీరితోపాటు నాని, వైజయంతీ మూవీస్, చిరంజీవి, రవితేజ, అఖిల్, నాగచైతన్య, అమల, ఖుష్బూ, మాధవీలతతోపాటు పలువురు నటీనటులు సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

 

Related Posts

Pawan kalyan: ఇష్టమైన హీరోయిన్ గురించి మొదటిసారిగా స్పందించిన పవన్ కళ్యాణ్..

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేనిది. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన తాజా సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) కొంత గ్యాప్ తర్వాత వచ్చినప్పటికీ, ప్రేక్షకుల్లో మంచి అంచనాలను కలిగించింది.…

ఆ సినిమా నేనే చేసుంటే బాగుండేది.. ఎన్టీఆర్‌ సినిమాపై హృతిక్ కామెంట్ వైరల్..

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎంతో మంది స్టార్ హీరో హీరోయిన్ లు గుర్తుకొస్తారు. వారు చేసిన సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయికి ఎదగడంలో కీలక పాత్ర…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *