Mana Enadu : రోజులో ఏదైనా చెడు జరిగిందో.. పొద్దున లేవగానే ఎవరి ముఖం చూశానో అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆరోజు ఏం చెడు జరిగినా.. ఇక వాళ్లనే బ్లేమ్ చేస్తుంటారు. ఒకప్పుడు ఉదయం నిద్ర లేవగానే.. దేవుడి పటం (God Photo) చూడటం గానీ.. అరచేతులు చూస్తూ ఏదైనా శ్లోకం చదవడం గానీ చేసేవారు. ప్రస్తుతం కాలం మారింది. ఇప్పుడు ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరు వెంటనే మొబైల్ ఫోన్ (Mobile Phone) చూస్తున్నారు. అసలు ఉదయం (Morning) నిద్ర లేవగానే ఎవరి ముఖం చూడాలి..? నిద్రలేచిన తర్వాత ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు..? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
లేవగానే ఇలా చేయాలి
ఉదయం నిద్రలేవగానే అర చేతులు (Palms) చూసుకోవడం మంచిదని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు వేణుగోపాల్ తెలిపారు. అరచేతులు చూడడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత.. దేవుడి చిత్రపటాన్ని చూడాలని.. ఇలా చేయడం వల్ల ధనవృద్ధి కలుగుతుందని అంటున్నారు.
ఇలా చేస్తే ఆరోగ్యం మీ సొంతం
రాత్రి పడుకునే ముందు ఒక చిన్న గిన్నెలో ఆవు నెయ్యి (Cow Ghee) తీసి పక్కన పెట్టుకుని .. ఉదయాన్నే నిద్రలేవగానే చేతితో అద్దానికి కాస్త నెయ్యితో బొట్టు పెట్టి.. అద్దంలో మీ ముఖం చూసుకోండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతీది జ్యోతిష్య శాస్త్రంలో ఉంది
జీవితంలో మనం నిద్ర లేచినప్పటి నుంచి మొదలుకుని రాత్రి పడుకునే వరకు.. చేసే ప్రతి పని గురించి కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. శాస్త్రం ప్రకారం.. వీటిని పాటించడం వల్ల అంతా మంచి జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.
గమనిక : పైన తెలిపిన వివరాలు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.








