ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం మంచిదేనా?

Mana Enadu : సాధారణంగా ఉదయం లేవగానే చాలామందికి దాహం వేస్తుంది. కొందరు పళ్లు తోమకుండా లేచిన వెంటనే నీళ్లు (Water) తాగుతుంటారు. మరికొందరేమో బ్రష్ చేసిన తర్వాతే నీళ్లు తాగుతారు. పరిగడుపున నీళ్లు తాగడం మంచిదని డాక్టర్లు చెబుతుంటారు.

అయితే బ్రష్ చేయకుండా తాగడం మంచిదేనా..? కొందరైతే ఏకంగా బెడ్ కాఫీ (Bed Coffee), బెడ్ టీ, బెడ్ టిఫిన్ అంటూ పళ్లు తోమకుండా టీ, కాఫీలు తాగేస్తుంటారు. టిఫిన్లు కూడా చేసేస్తుంటారు. మరి ఇలా బ్రష్ చేయకుండా తాగడం, తినడం మంచిదేనా..? దీనిపై నిపుణులు ఏమంటున్నారు?

బ్రష్ చేయకుండా నీళ్లు తాగొచ్చా

ఉదయం లేవగానే బ్రష్ చేసిన తర్వాతే ఏదైనా తాగడం, తినడం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పళ్లు తోమకుండా (Brushing) నీళ్లు తాగడం మంచిది కాదని అంటున్నారు. అలా తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. రాత్రికి పడుకుని ఉదయం లేవగానే నోటి నిండా క్రిములు, బ్యాక్టీరియా ఉంటాయని..  లేవగానే నోరు శుభ్రం చేసుకోకుండా నీళ్లు తాగితే.. నీళ్లతోపాటు క్రిములు కూడా శరీరంలోకి ప్రవేశిస్తాయని చెబుతున్నారు.

లేవగానే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది

పరిగడుపున ఒక గ్లాస్ లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగడంవల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే నీళ్లు తాగడంవల్ల శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని.. శరీరంలో ఉన్న టాక్సిన్స్ (Toxins), మలిన పదార్థాలు బయటకు పోతాయని చెబుతున్నారు. మల బద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవని తెలిపారు.

ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే 

ఉదయం లేవగానే నీళ్లు తాగితే శరీరంలో కూడా రోగనిరోధక శక్తి (Immunity) పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే చర్మ సమస్యలు (Skin Problems) పోయి ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. చర్మానికి సహజంగానే మెరుపు వస్తుందని.. ఇంకా.. గోరు వెచ్చని నీళ్లు తాగితే జీర్ణాశయం శుభ్రమవుతుందని అంటున్నారు.

గమనిక : ఇక్కడ ఇచ్చిన ఆరోగ్య సమాచారం, చిట్కాలు పలు పరిశోధనలు, పలువురు వైద్య నిపుణులు సూచించినవి మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *