సామాన్యుడికి ఝలక్.. సెంచరీ కొట్టిన ‘టమాట’ ధర

Mana Enadu : నూనెలు (Edible Oils), పప్పు దినుసులు, ఉల్లిపాయ ధరలతో సై అంటే సై అంటోంది టమాట. టమాట ధర ఒక్కసారిగా కొండెక్కింది. రెండ్రోజుల క్రితం రూ.80 ఉన్న టమాట (Tomato) ప్రస్తుతం రూ.100 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో టమాట ధర సామాన్యులకు గాయం చేస్తోంది. డిమాండ్​కు సరిపడా దిగుబడులు లేకపోవడం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. 

టమాట ధర కిలోకు రూ.100

ఇటీవల వర్షాల వల్ల పంట దెబ్బ తినడంతో ఆయా ప్రాంతాల నుంచి టమాట దిగుమతి (Tomato Imports) నిలిచిపోవడంతో రేటు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీలో 22 కిలోల బాక్స్‌కు రూ.1,550 (కిలో రూ.70) చొప్పున అమ్ముతుండగా, రవాణా, ఇతర ఖర్చులతో కలిపి ఇక్కడి మార్కెట్‌లో హోల్‌సేల్‌గా రూ.80కు అమ్ముతున్నారు. రిటైల్‌ వ్యాపారులు మరో రూ.20 పెంచేసి రూ.100లకు విక్రయిస్తున్నారు.

ఏపీలోనూ టమాటల్లేవ్ 

ఇక ఏపీలో ప్రస్తుతం రూ.100 పలుకుతున్న టమాట ధర (Tomato Price Hike).. ఒకట్రెండు రోజుల్లో మరింత పెరగవచ్చనే వాదన వినిపిస్తోంది. డిమాండ్‌కు తగ్గ దిగుబడి లేకపోవడమే ఈ పరిస్థితి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఒక్కసారిగా టమాట ధర కొండెక్కడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. టమాటలు కొనేటట్టు లేదు తినేటట్టు లేదని వాపోతున్నారు.

డిసెంబరు తగ్గనున్న ధరలు 

రాజమహేంద్రవరం టోకు మార్కెట్‌కు గతంతో పోల్చితే సగం సరకే దిగుమతి అవుతోంది. రాజమహేంద్రవరంలోని పెద్ద రైతుబజార్ల (Rythu Bazar Tomato Price)కు రోజుకు టన్ను, చిన్నవాటికి 50 క్వింటాళ్లు అవసరం కాగా ప్రస్తుతం అందులో సగం మాత్రమే దిగుమతి చేసుకుంటున్నారు. డిసెంబర్ వరకు నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో టమాట పంట దిగుబడి వస్తుందని, అప్పటికీ ధరలు తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *