ManaEnadu: గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తోన్న సినిమాల్లో ఒకటి రాజాసాబ్ (Raja Saab). మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ హార్రర్ కామెడీ జోనర్‌లో వస్తోంది. మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ త్వరలోనే షురూ కానున్నాయని తెలిసిందే.
‘రాజా సాబ్’ విషయానికొస్తే.. మారుతి – ప్రభాస్ కాంబోలో వస్తోన్న తొలి చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హరర్ కామెడీగా రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు.
‘‘అక్టోబర్ 23న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ప్రారంభమవుతాయి. ఆ తర్వాత వరుసగా వస్తాయి. దీనికోసం దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వప్రసాద్ ప్రణాళికలు వేసుకున్నారు. త్వరలోనే ‘రాజాసాబ్’ అప్‌డేట్స్ గురించి వివరాలు వెల్లడిస్తాం. అక్టోబర్ 23 నుంచి విడుదల వరకు ‘రాజాసాబ్’ (Raja Saab) ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తాం. మీడియా వాళ్లకు కూడా ఆ ప్రపంచాన్ని చూపిస్తాం.