Eeswar Re-Release: హ్యాపీ బర్త్ డే ‘డార్లింగ్’.. ప్రభాస్ ‘ఈశ్వర్’ రీరిలీజ్

Mana Enadu: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్(Panindia star Prabhas)) ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ భారీ సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ ఇటీవలే Kalki 2898AD చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద న్యూ రికార్డ్స్ తిరగరాసింది. ప్రస్తుతం డార్లింగ్(Darling) చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఆయన బర్త్ డే (OCT 23) సందర్భంగా ప్రభాస్ తొలి సినిమా ‘ఈశ్వర్(Eeswar)’ మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. బుధవారం ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

కొత్త ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్‌(Rerelease)ల ట్రెండ్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రభాస్ సినిమాలు (సలార్, Mr.పర్‌ఫెక్ట్) రీరిలీజ్ అవ్వగా ఇప్పుడు 2002 నవంబర్ 1న థియేటర్లలోకి వచ్చిన ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ రీ రిలీజ్ కానుంది. ప్రభాస్ బర్త్ డే(Prabhas BirthDay) సందర్భంగా ఈశ్వర్ సినిమాని అక్టోబర్ 23న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల కొత్త ట్రైలర్‌(New Trailer)ని కూడా మేకర్స్ విడుదల చేయగా యూట్యూబ్‌లో దూసుకుపోయింది.

నీ చేతిలో డబ్బుంటే.. నా ఛాతిలో దమ్ముంది

ప్రభాస్ కెరీర్ తొలి సినిమాగా వచ్చిన ఈశ్వర్‌ను డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ (Jayant C. Paranji)తెరకెక్కించారు. కె. అశోక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్(RP Patnaik) స్వరాలు సమకుర్చారు. యాక్షన్ రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంలో ప్రభాస్‌కు జంటగా శ్రీదేవి విజయ్ కూమారి(Sridevi is VijayKumari)నటించారు. బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, శివ కృష్ణ, బిక్షు తదితరులు కీలక పాత్రలలో అలరించారు. ‘నీ చేతిలో డబ్బుంటే.. నా ఛాతిలో దమ్ముంది’ అంటూ ప్రభాస్ చెప్పిన మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అప్పట్లో ఓ ఊపు ఊపాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *