రూ.3 వేలకే విమానంలో విశాఖ టు విజయవాడ!

Mana Enadu : విమాన ప్రయాణం(Flight Journey) అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ అందరికీ అది అందుబాటులో ఉండదు. కారణం ఆకాశాన్నంటే టికెట్ల ధరలు. మధ్యతరగతి కుటుంబాల్లో చాలా మందికి విమానంలో ప్రయాణించడమనేది ఒక పెద్ద కల. అయితే ఇప్పుడు కేవలం మూడు వేల రూపాయలకే విమానంలో ప్రయాణించవచ్చు. అది కూడా విశాఖపట్నం నుంచి విజయవాడ(Visakha To Vijayawada)కు వెళ్లొచ్చు. మరి ఎందుకింక ఆలస్యం.. ఆ వైపునకు వెళ్లాలంటే హాయిగా ఆకాశాంలో తేలుతూ విమాన ప్రయాణం చేయండి.

విశాఖ – విజయవాడ విమాన సర్వీసులు

విశాఖపట్నం – విజయవాడ మధ్య కొత్తగా 2 విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు(Rammihan Naidu) విశాఖ విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసును ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  విశాఖ టు విజయవాడ మధ్య ఫ్లైట్ కనెక్టివిటీ పెంచాలని చాలా మంది కోరారని తెలిపారు.

ఇదే తొలిసారి

“ఒకేసారి రెండు నగరాల మధ్య రెండు ఫ్లైట్లు ప్రారంభం కావడం బహుశా ఇదే మొదటిసారి. 2 నగరాల మధ్య ఎక్కువ సీట్లు అందుబాటులోకి రావడంతో విమాన టికెట్ల ధరలు(Plane Ticket Price) తగ్గుతాయి. విశాఖ విజయవాడ మధ్య రూ.3000కే టికెట్ దొరికే అవకాశం ఉంది.” అని తెలిపారు. ఈ కొత్త విమానాలతో కలిపి విశాఖ – విజయవాడ మధ్య తిరిగే సర్వీసుల సంఖ్య 3కు చేరినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు చెప్పారు. 

విశాఖ – విజయవాడ విమాన సర్వీసుల వివరాలు

  • ఎయిర్‌ ఇండియా(Air India) ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ఉదయం 9:35 గంటలకు విశాఖలో బయలుదేరి 10:35కు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరి.. తిరిగి రాత్రి 7:55కు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖ రీచ్ అవుతుంది. 
  • ఇండిగో సర్వీసు(Indigo Service) రాత్రి 7:15కు విజయవాడలో బయలుదేరి 8:20కి విశాఖ చేరుతుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8:45కు విశాఖలో బయలుదేరి 9:50కి విజయవాడ రీచ్ అవుతుంది. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *