Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ గ్రూప్ ఫొటో.. ప్చ్, ఆమె ఒక్కరే మిస్సింగ్!

Mana Enadu: అక్కినేని నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా  ఏఎన్ఆర్-2024 అవార్డు(ANR-2024 Award) అందుకున్నారు. చిరంజీవి (Megastar Chiranjeevi) మాట్లాడుతూ.. భారతీయ సినీరంగంలో బాద్​షా లాంటి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. భగవంతుడు తనకు ఇచ్చిన అద్భుతమైన స్నేహిడుతు నాగార్జున(Nagarjuna) అని కొనియాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్​(Annapurna Studios)లో జరిగిన ఈ వేడుకకు అక్కినేని కుటుంబసభ్యులతో సహా, చిరంజీవి తల్లి అంజనాదేవి, విక్టరీ వెంకటేశ్, రామ్​చరణ్, అల్లు అర్జున్, నాని, సుబ్బిరామి రెడ్డి, నిర్మాత అశ్వినీదత్, బోయపాటి శ్రీను, నాగ్ అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.

 ఏ మాయ చేసావే సినిమా టైంలో

అయితే ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ ఫొటో చూసినప్పుడల్లా నెటిజన్స్ అబ్బా ఎంత అందంగా ఉంది. కుటుంబం అంటే ఇలా ఉండాలి అనుకునేవారు. ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ ఫొటో చూసినప్పుడల్లా.. అందరికీ ఒక నిరాశ. అదే ఆ ఫ్యామిలీలో సమంత(Samantha) లేదు. ఇది ఇది ఎంతోమందిని బాధిస్తుంది. ఏ మాయ చేసావే సినిమా టైంలో నాగచైతన్య(Naga chaitanya)తో ప్రేమలో పడి వివాహం(Love Marriage) చేసుకుంది. చిలకాగోరింకళ్లా ఉన్న ఈ జంట ఉన్నట్లుండి తమ వైవాహిక జీవితానికి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత సామ్ ఎంతో బాధపడ్డారు. అనారోగ్యంతోనూ బాధపడ్డారు.

 కాబోయే కోడలే సెంట్రాఫ్ ఎట్రాక్షన్

తాజాగా ఏఎన్ఆర్ అవార్డుల ఫంక్షన్‌లో చైతూ- శోభితా ధూళిపాళ్ల(Chaitu- Sobhita Dhulipalla) కనిపించడంతో సమంత ఇష్యూ తెరపైకి వచ్చింది. ఈవెంట్‌లో కాబోయే కోడలే సెంట్రాఫ్ ఎట్రాక్షన్(Centrof attraction). చై పక్కనే ఉంటూ.. అక్కినేని కుటుంబంతో కలిసిపోయి కలివిడిగా తిరుగుతూ కనిపించింది. నాగ్ సైతం.. కొత్త కోడలిని సెలబ్రిటీస్ కు పరిచయం చేశాడు. ఇక చివరగా.. అక్కినేని కుటుంబం మొత్తం ANR అవార్డు అందుకున్న చిరుతో.. ఆ అవార్డును ప్రదానం చేసిన అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఫొటో దిగారు. ప్రస్తుతం ఈ ఫిక్ నెట్టింట వైరల్‌గా మారింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *