నాగ చైతన్య-శోభిత వెడ్డింగ్ కార్డు వైరల్

Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కల్యాణ వేడుకకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. డిసెంబరు 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదికగా జరిగే ఈ వేడుకను నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖులు, బంధువులు, సన్నిహితులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు తెలిసింది.

సోషల్ మీడియాలో శుభలేఖ వైరల్

అయితే తాజాగా ఈ జంట పెళ్లికి సంబంధించిన శుభలేఖ(naga chaitanya sobhita dhulipala wedding date) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా శోభిత తరపున బంధువులకు ఇస్తున్న వివాహ ఆహ్వాన పత్రిక ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.పెళ్లి కార్డుతో పాటు ఓ బుట్ట.. ఆ బుట్టలో చీర, పసుపు కుంకుమ, వెండి వస్తువు.. వీటన్నింటిని కలిపి పెళ్లి కార్డుగా ఆహ్వానం అందించారు.

మీ దీవెన మాకు దక్కే గౌరవం 

ప్రస్తుతం ఈ కార్డుకు సంబంధించిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ శుభలేఖలో వధువు, వరుడు తల్లిదండ్రులతో పాటు, వాళ్ల తాతయ్య బామ్మల పేర్లను కూడా చేర్చడం కార్డులో చూడవచ్చు. ‘ఈ ప్రత్యేకమైన సందర్భంలో మీ శుభాకాంక్షలు, దీవెనలు మాకు దక్కే గొప్ప గౌరవం’ అని ఆహ్వాన పత్రికలో రాసి ఉంది. ఈ కార్డు చూసి నాగచైతన్య (Naga Chaitanya Marriage) ఫ్యాన్స్ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఆగస్టులో నిశ్చితార్థం

నాగచైతన్య, శోభితా ధూళిపాళ (Shobita Marriage) నిశ్చితార్థం ఈ ఏడాది ఆగస్టులో జరిగిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో హైదరాబాద్ లో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ నాగార్జున ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *