Mana Enadu : ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ(IMDb) తాజాగా మోస్ట్ పాపులర్ నటీనటుల లిస్టును రిలీజ్ చేసింది. ఐఎండీబీలో ఈ ఏడాదిలో ఎక్కువగా వెతికిన హీరో-హీరోయిన్ల జాబితాను ప్రకటించింది. వీక్లీ లిస్ట్‌లో ఆదరణ పొందిన జాబితాలో ఉన్న వారి ర్యాకింగ్ ఆధారంగా ఈ లిస్టును రెడీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 250 మిలియన్లకు పైగా వ్యూస్ ను ఆధారంగా చేసుకొని ఈ ర్యాంకింగ్స్‌ను వెల్లడించింది.
టాప్-1లో త్రిప్తి దిమ్రి
ఈ జాబితాలో టాప్-1లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ (Triptii Dimri) నిలిచింది. ఈ ఏడాది ఆమె నటించిన ‘బ్యాడ్ న్యూజ్’, ‘లైలా మజ్ను’ రీ-రిలీజ్, ‘భూల్ భులయ్యా 3’ సినిమాలు విడుదల కావడంతో ఈ భామ పాపులారిటీ పెరిగింది. ఇక ప్రెగ్నెన్సీ, డెలివరీ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె రెండో స్థానంలో నిలిచారు. మూడు నంబరులో యంగ్ హీరో ఇషాన్ ఖత్తర్ నిలవగా.. నాలుగో స్థానాన్ని బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shahrukh Khan) సొంతం చేసుకున్నారు.
టాప్-5 నంబరులో శోభితా
ఇక టాలీవుడ్ హీరో నాగచైతన్యతో పెళ్లి, మంకీ మ్యాన్ సినిమా విడుదల నేపథ్యంలో టాప్ 5లో నటి శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) నిలిచింది. ఆరో స్థానంలో శార్వరీ వాఘ్.. ఏడో స్థానాన్ని ఐశ్వర్యరాయ్ దక్కించుకున్నారు. సిటడెల్ వెబ్ సిరీస్, నాగచైతన్య రెండో పెళ్లి, తన ఆరోగ్యం, వ్యక్తిగత విషయాల నేపథ్యంలో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో అలియా భట్, ప్రభాస్ (Prabhas) ఉన్నారు.







