Mana Enadu : ధరలు(Price) ఎంతలా పెరిగిపోతున్నా.. నిత్యావసర సరుకుల(Essential commodities)ను కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందే. అయితే, చాలామంది తమ జీతం(Salary)లో ఎక్కువ మొత్తాన్ని ఇలా వంట సామగ్రి(cooking equipment)కే ఖర్చు చేస్తుంటారు. నెలకు సరిపడా వస్తువులను సరిగ్గా అంచనా వేయక, అనవసర వస్తువులను కూడా కొనుగోలు చేస్తుంటారు. కిరాణా సామాన్ల(Groceries) విషయంలో అనేక ఇబ్బందులు పడుతుంటారు. మరి ఇలాంటి ఖర్చు(Costs)లను ఎలా తగ్గించుకోవాలి. మార్కెట్‌కు వెళ్లినప్పుడు సామాగ్రిని ఎలా కొనుగోలు చేయాలి వంటివి ఇప్పుడు తెలుసుకుందాం.
- మార్కెట్(Markets)కు వెళ్లేముందే మీకేం కావాలో లిస్ట్ తయారు చేసుకోండి. ఇలా చేస్తే ఇంట్లో ఆల్రెడీ ఉన్న వస్తువులను మళ్లీ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.
- మీరు షాపింగ్(Shopping) కోసం ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకొని, అంతే ఖర్చు పెట్టండి.
- వివిధ స్టోర్లలో ఆఫర్లు, డిస్కౌంట్లు(Offers and discounts) ఉంటాయి. వాటి గురించి తెలుసుకొని, ధరలను పోల్చుకొని మీకెక్కడ మెరుగ్గా అనిపిస్తే అక్కడ కొనుగోలు చేయండి.
- బల్క్(Bulk)లో కొనడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. అలా అని నిల్వ ఉండని వస్తువులను బల్క్‌లో కొనవద్దు.
- ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్(Fridge)ను మెరుగ్గా ఉపయోగించుకోవడం చాలా అవసరం. దీనివల్ల ఆహార పదార్థాలు వృథా కాకుండా కాపాడుకోవచ్చు. చెడిపోయే అవకాశం ఉండే వస్తువులను కచ్చితంగా ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. బూజు పట్టే ఆహారం, అరటిపళ్లు, సలాడ్ వంటివి మాత్రం బయటే ఉంచాలి.
- నాణ్యమైన, నాన్‌స్టిక్(Nonstick) పాత్రల ఎంపిక నూనె వాడకాన్ని తగ్గిస్తుంది. వంట చేసుకోవడానికి సెరామిక్ పాత్రలను కూడా వాడొచ్చు.
- సమోసా, కబాబ్స్ వంటివి చేస్తున్నప్పుడు అవెన్‌ని ఉపయోగిస్తే మంచిది.
- కూరగాయల్ని వండుతున్నప్పుడు వంటపాత్రలపై చక్కగా అమిరే మూత పెట్టాలి. ఇలా చేస్తే ఆవిరి, తేమతోనే అవి త్వరగా ఉడికిపోతాయి. దీంతో గ్యాస్‌తో పాటు కాస్త నూనె కూడా ఆదా అవుతుంది.
- ఆయిల్ స్ప్రే బాటిళ్ల(Oil spray bottles)ను వాడితే నూనె వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.
- మంట తక్కువగా పెట్టుకోవడం వల్ల దాదాపు 10% గ్యాస్(Gas) ఆదా అవుతుంది. వెడల్పాటి పాత్రలపై వండితే మంట వృథా కాదు. విండ్‌ప్రూఫ్ జాలీలు వాడాలి.







