పందెం కోడి (Pandem Kodi), పొగరు, భరణి, పూజా, పందెం కోడి-2 వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు వాళ్లకు సుపరిచుతుడు కోలీవుడ్ హీరో విశాల్ (Vishal). తెలుగువాడే అయినా తమిళనాడులో సెటిల్ అయిన ఈ హీరో దాదాపుగా తన ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటాడు. అలా తెలుగు సినీ ప్రియులకు చాలా దగ్గరయ్యాడు. ఇక కేవలం సినిమాలతోనే కాదు.. ఆయన తన మాటలతో, ప్రవర్తనతోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో విశాల్ ఎక్కువగా లైమ్ లైట్ లో లేడు.
విశాల్ కు అసలేమైంది
తాజాగా విశాల్ నటించిన ‘మదగజరాజ (Madha Gaja Raju)’ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. అయితే ఈ సినిమా తీసి దాదాపు 12 ఏళ్లు గడిచింది. కానీ వివిధ కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విశాల్ మదగజరాజ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ (Vishal At Pre Release Event) నిర్వహించారు. చాలా గ్యాప్ తర్వాత లైమ్ లైట్ లోకి వచ్చిన హీరోను చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయన ఏదో అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు కనిపించారు.
Take care vishal naa y hand ivolo nadungudhu?🥲 #MadhaGajaRaja pic.twitter.com/LLHjhDFKHp
— Sanjayrant/alterego (@as_rantts) January 5, 2025
మాట్లాడలేని స్థితిలో విశాల్
విశాల్ ముఖం అంతా వాచిపోయి, మాట్లాడుతున్నప్పుడు నోరు, చేతులు వణుకుతున్నట్లుగా అనిపించాయి. ఆయన్ను సరిగా మాట్లాడలేని స్థితిలో చూసి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు విశాల్ (Vishal Health Issue) కు ఏమైంది అని ఆరా తీస్తున్నారు. అయితే విశాల్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో చలిజ్వరంతో బాధపడుతున్నాడని సోషల్ మీడియాలో క్లారిటీ ఇస్తుంటే.. లేదు లేదు.. ఆ మధ్య ఓ సినిమా షూటింగ్ లో విశాల్ కు తీవ్ర గాయం కావడంతో కంటిపై భాగంలో నరాలు దెబ్బతిన్నాయని దాని వల్లే ఇలా అయ్యి ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఏదైమైనా విశాల్ త్వరగా కోలుకుని మళ్లీ ఎనర్జిటిక్ గా సినిమాలు చేస్తూ అందరి ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.







