టాలీవుడ్ లో విషాదం.. ‘యజ్ఞం’ సినిమా విలన్ కన్నుమూత

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ‘యజ్ఞం (Yagnam Movie)’ సినిమాలో నాయుడమ్మగా విలనిజం పండించిన ప్రముఖ నటుడు విజయ రంగరాజు (Vijaya Rangaraju) అలియాస్ రాజ్ కుమార్ ఇక లేరు. చెన్నైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన ఇవాళ మరణించారు. వారం క్రితం హైదరాబాద్ లో ఓ సినిమా షూటింగులో ఆయన గాయపడ్డారు. చికిత్స కోసం చెన్నై వెళ్లారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆయన కన్నుమూశారు.

ఎక్కువగా విలన్ పాత్రలు

విజయ రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తెలుగు సినిమాల్లో ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనే కనిపించారు. సహాయ పాత్రల్లోనూ అప్పుడప్పుడు అలరించారు. 1994లో వచ్చిన బాలకృష్ణ ‘భైరవ ద్వీపం (bhairava dweepam)’ చిత్రంతో ఆయన తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. అయితే యజ్ఞం సినిమాలోని నాయుడమ్మ పాత్ర ఆయనకు గుర్తింపు తీసుకువచ్చింది. విజయ రంగరాజు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *